Masala movie effects on venkatesh

masala movie effects on venkatesh, Venkatesh, hero ram, masala movie, Telugu movie Masala, masala movie collection week, Victory Venkatesh Speaks about Masala Movie

masala movie effects on venkatesh

వెంకీలో మసాలా ఘాటు తగ్గిందా?

Posted: 11/19/2013 01:52 PM IST
Masala movie effects on venkatesh

విక్టరీ వెంకీలో మసాలా ఘాటు తగ్గిందాని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వెంకీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి అందరి అంచనాలను వెంకీ తారుమారు చేసారు. రీసెంట్ గా విడుదలైన ‘మసాల’ సినిమా ఎప్టెక్ వెంకీ మీద పడింది. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం సాధించినప్పుడు అందరి కళ్లు పిన్స్ మహేష్ బాబు వైపే చూశాయి. కానీ ఈసారి మసాల దెబ్బ మాత్రం వెంకీ మీద పడుతుందనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. కుర్ర హీరో రామ్ తో కలిసి నటించిన మసాలాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అందరు ఆశపడ్డారు. ఓవర్సీస్ లో మసాలా సినిమాకి కోటి రూపాయలు చెల్లించడానికి కూడా కారణం ఆశ. అయితే అందరి ఆశలపై మసాలా నీళ్లు చల్లాడు వెంకీ. అయితే ఊహించని విధంగా మసాలా సినిమాకు నామమాత్రపు ఓపెనింగ్స్‌ మాత్రమే వస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

వెంకీ మసాలా సినిమాను కాపాడలేకపోయాడు. 'మసాలా' చిత్రానికి తొలి నాలుగు రోజుల్లో వసూళ్లు అంతంత మాత్రంగా వచ్చాయి. మొదటి నాలుగు రోజుల్లో ఏడు కోట్ల పైచిలుకు షేర్‌ మాత్రమే వచ్చింది. వారం ముగిసేలోగా పది కోట్లు దాటుతుందనేది కూడా అనుమానమే. ఈ చిత్రం కనీసం ఇరవై కోట్లు దాటితే తప్ప ఒక మాదిరిగా అయినా ఆడినట్టు. కానీ పదిహేను కోట్ల షేర్‌ రావడం కూడా అనుమానంగానే కనిపిస్తోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద వెంకీలో మసాలా తగ్గిందనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

 

విక్టరీ లో పవర్ తగ్గిందా లేక, వెంకీ ఇలాంటి సినిమాలు ఇష్టం లేదా? వెంకీ ఇలా ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కావటంలేదని వెంకీ అభిమానులు బాధపడుతున్నారు. వెంకీ తరువాత సినిమా హీరో రామ్ చరణ్ తో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మసాలా ఘాటు.. వెంకీ తరువాత సినిమా పై ఉంటుందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. వెంకీ రామ్ చరణ్ సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles