Nandamuri balakrishna caught with 7 heroines

Nandamuri Balakrishna caught with 7 Heroines, Balakrishna Legend movie, Balakrishna dance with 7 heroines

Nandamuri Balakrishna caught with 7 Heroines, Balakrishna Legend movie, Balakrishna dance with 7 heroines

బాలయ్య ఏడుగురితో ఎంజాయ్ చేయబోతున్నాడు

Posted: 11/16/2013 06:56 PM IST
Nandamuri balakrishna caught with 7 heroines

విచిత్రం అంటే ఇదే మరి.... మొన్నటి వరకు తమ సినిమాలో నటించడానికే ఏ హీరోయిన్ ముందుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఓ పాటకోసం ఏడుగురు హీరోయిన్లను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? ఇంకెవరు మన బాలయ్య. ఈయన ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో ‘లెజెండ్ ’ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన కష్టపడి సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే కథానాయికలను సెలక్ట్ చేశారు. వీరిద్దరు ఈ సినిమాలో ఖరారు ఖావడంతో షూటింగు కూడా సాఫీగా సాగిపోతుంది.

ఈ సినిమాలో బాలయ్య కోసం దర్శకుడు భారీ హంగుల్ని సమకూర్చాడు కూడా. ‘సింహా ’ సినిమా హిట్టు కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లు గానే దర్శక నిర్మాతలు కూడా ఏ మాత్రం రాజీపడకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు తాజాగా బోయపాటి ఏడుగురు కథానాయికలతో  ఓ పాటను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన మాంచి ఓ మాస్ పాటను భారీ హంగామాతో  తెరపైకి తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఇందులోబాలయ్యతో ఏడుగురు కథానాయికలు ఆడిపాడే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

అయినా ‘తినడానికి తికానా లేకపోయినా, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్లు ’ ఈయనతో సినిమా చేయడానికే భయపడ్డ ముద్దుగుమ్మలు పాటలో నటించడానికి ఒప్పుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూనే... ఈయనేమైనా మన్మధుడా అని జోకులు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles