Koratala siva ntr film cancelled

Koratala Siva -NTR film cancelled, Ntr, Mahesh Babu,Koratala Siva, Mahesh Babu project

The director turned writer shared that he is committed to his next flick starring Mahesh Babu for now.

ఎన్టీఆర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు

Posted: 11/07/2013 09:44 AM IST
Koratala siva ntr film cancelled

రచయిత నుండి దర్శకుడిగా అవతారం ఎత్తి ప్రభాస్ తో మిర్చి సినిమా తీసి తొలి సినిమాతోనే మంచి క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఆ సినిమా తరువాత నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. మొదట రామ్ చరణ్ తో చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో అది కాన్సిల్ అయింది.

అదే స్టోరీని మహేష్ బాబుకు చెప్పడంతో అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తరువాత డేట్లు ఇచ్చాడు. ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి అయింది.

కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా అటకెక్కింది. డిసెంబర్‌లో మొదలు కానుందని వార్తలొచ్చిన సినిమా ఇప్పుడు ఏడాదికి పైగా వాయిదా పడుతోందంటే ఇక అది సెట్స్‌ మీదకి వెళ్లే అవకాశాలు తక్కువ.ఎన్టీఆర్‌ ఇప్పుడు సంతోష్‌ శ్రీనివాస్‌ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా, మే నెల వరకు అతని డేట్స్‌ దొరకవు. అంతలో మహేష్ తో సినిమా మొదలయ్యే సమయం వస్తుంది కాబట్టి ఈ సినిమాను ప్రస్తుతానికి రద్దు చేసుకున్నారని అంటున్నారు. మహేష్ సినిమా తరువాత ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles