Rajamouli bahubali teaser birthday gift to prabhas

Rajamouli Bahubali Teaser birthday gift to Prabhas, prabhas bahubali teaser, prabhas bahubali making video, bahubali teaser, bahubali making video, bahaubali first look, prabhas bahubali first look, prabhas birthday, prabhas bahubali teaser on birthday

Latest buzz that the filmmakers are planning to release Baahubali making video on Prabhas Birthday on October 23. The duration of making video will be around 1 minutes as per the sources

‘బహుబలి ’ టీజర్ వచ్చేస్తుంది

Posted: 10/16/2013 04:41 PM IST
Rajamouli bahubali teaser birthday gift to prabhas

దర్శక ధీరడు రాజమౌళి ఏది చేసినా వినూత్నంగా, వైవిధ్యంగా, ఎవరూ ఊహించనంతగా ఉంటుంది. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బహుబలి ’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మూడో షెడ్యూలు కూడా ప్రారంభం అయింది. ఈ సినిమా మొదలయినప్పటి నుండి ఇందులో హీరో ప్రభాస్ గెటప్ ఎలా ఉండబోతుంది ? వీరు చేసే పాత్రలు ఏమిటి ? ఎలా ఉండబోతున్నాయి ? ఇలా అనేక విషయాల పై  సినీ జనాల్లో తెగ ఆసక్తి నెలకొన్నది. వారందరి సందేహాలకు ఈనెల 23వ తేదీన సమాధానం చెప్పబోతున్నాడు రాజమౌళి.

ఆరోజు ప్రభాస్ పుట్టిన రోజు కాబట్టి అతని పుట్టిన రోజు కానుకగా ప్రభాస్‌ లుక్‌ని బయట పెట్టడంతో పాటు , ఓ మేకింగ్‌ వీడియోని విడుదల చేస్తారట. ఒక నిమిషం నిడివి గల ఈ వీడియో ప్రభాస్‌ అభిమానులను అలరించే విధంగా ఉంటుందని సమాచారం. గతంలో కూడా ‘ఈగ ’ సినిమా షూటింగు ఆలస్యం కావడంతో దానికి సంబంధించిన కొన్ని వీడియోలను విడుదల చేసి జనాల్లో క్రేజ్ తగ్గకుండా చేశాడు. ఇప్పుడు కూడా ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాల టైం పట్టే విధంగా ఉండటంతో రాజమౌళి ఈ ప్లాన్ వేశాడని అంటున్నారు.

ఇటు ప్రభాస్ కి పుట్టిన రోజు కానుకగా, అటు సినిమా పబ్లిసిటీ పరంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి కొందరు మాత్రం జక్కన్న ఈ సినిమా విషయంలో ఎంత జాగ్రత్త పడ్డ ఏదో ఒకటి లీగ్ అవుతుండటంతో, అధికారికంగా కొన్ని సీన్స్ ని విడుదల చేస్తేనే మంచిదని ఇలా డిసైడ్ అయ్యాడని అంటున్నారు. జక్కన్న ప్లాన్ ని ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles