Director lingusamy movie with jr ntr

NTR accepts Director Linguswamy Movie, NTR to work with Linguswamy, Mahesh babu rejected Tamil Director Linguswamy, Ntr-Linguswamy Project soon

NTR accepts Director Linguswamy Movie, NTR to work with Linguswamy, Mahesh babu rejected Tamil Director Linguswamy, Ntr-Linguswamy Project soon

తమిళ దర్శకుడితో బుడ్డ ఎన్టీఆర్

Posted: 10/16/2013 03:08 PM IST
Director lingusamy movie with jr ntr

యంగ్ టైగర్ కి ఈ మధ్య సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. ఏ దర్శకుడు హిట్ ఇస్తే ఆ దర్శకుడితో సినిమా చేస్తూ పోతున్నాడు. కానీ ఎన్టీఆర్ అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఈ మధ్యనే హరీశ్ శంకర్ దర్వకత్వంలో చేసిన ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టడంతో ఎన్టీఆర్ కి గట్టి దెబ్బ తగిలింది. దీంతోనైనా ఆచితూచి అడుగులు వేస్తాడని అనుకున్నారు.

కానీ ప్రముఖ హీరోలు రిజెక్ట్ చేసిన కథల్ని సైతం కమీట్ అవుతూ అందరికి షాక్ ఇస్తున్నాడు. ఆ మద్య తమిళ దర్శకుడు లింగుస్వామి ప్రిన్స్ మహేష్ తో ఓ సినిమా తీయడానికి చాలా ప్రయత్నించి ఎట్టకేలకు ఓ కథను వినిపించాడు. ఆయన నచ్చలేదంటూ ప్రక్కన పెట్టేశాడు. దీనితో షాక్ కు గురిఅయిన లింగుస్వామి ఈ కథను ఈ మధ్యనే మన బుడ్డోడు ఎన్టీఆర్ కు వినిపిస్తే జూనియర్ మరొక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ లో ఒక్కరో ఇద్దరో తప్ప మిగిలిన తమిళ దర్శకులు ఎవరూ పెద్దగా క్లిక్ అయిన దాఖలాలు లేవు. మరి తొలిసారిగా తమిళ దర్శకుడితో కమిటీ అయిన ఎన్టీఆర్ కి సరైన హిట్ ని ఇస్తాడో లేక అందరి దర్శకుల లాగానే ఈయన కూడా ఏదో సినిమా చేసేసి చేతులు దులుపుకుంటాడో చూడాలి. ఇక ఈసినిమా ను తమిళంలో సూర్యతో, తెలుగులో ఎన్టీఆర్ తో ఏక కాలంలో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సమంతాను ఎంపిక చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles