Salman khan to team up with ram charan

Salman Khan to team up with Ram Charan

Salman Khan to team up with Ram Charan

సల్లూ భాయ్ తో.. టాలీవుడ్ మగధీరుడు

Posted: 10/07/2013 02:06 PM IST
Salman khan to team up with ram charan

బాలీవుడ్‌లో తన తొలి చిత్రం 'జంజీర్‌' విజయవంతం కాకపోవడంతో రామ్‌చరణ్‌ ఇప్పుడు సక్సెస్‌ కసిమీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బాలీవుడ్‌లో మరో చిత్రం చేయబోతున్నారన్న వార్తలు ఇటీవల వెలువడున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ కూడా ఇప్పుడు తండ్రి బాటలోనే నడుస్తున్నారు. బాలీవుడ్‌లో బంపర్‌హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ముందుకెళతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో చరణ్‌కి కొండంత అండగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నిలబడ్డట్టు తెలుస్తోంది. తానూ సల్మాన్ కలిసి నటించాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం చరణ్ మీడియా ముందు కూడా చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇటీవలే సల్మాన్ నివాసంలో వీరి కొత్త సినిమాకు సంబంధించిన చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సల్మాన్ కానీ లేక ఆయన తమ్ముడు సోహైల్‌ఖాన్ కానీ నిర్మించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. సల్మాన్, చరణ్ కలిసి నటించే ఈ చిత్రం కోసం అప్పుడే కథాచర్చలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles