Tamil hero vijay eyes attarintiki daredi remake rights

Tamil Hero Vijay Eyes Attarintiki Daredi Remake Rights,attarintiki daredi tamil remake, attarintiki daredi, pawan kalyan, samantha, pranitha, vijay,

Tamil Hero Vijay Eyes Attarintiki Daredi Remake Rights,attarintiki daredi tamil remake, attarintiki daredi, pawan kalyan, samantha, pranitha, vijay,

పవన్ ‘అత్తారిల్లు ’ పై ఆ హీరో కన్ను

Posted: 10/04/2013 12:13 PM IST
Tamil hero vijay eyes attarintiki daredi remake rights

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉంటుందో, ఆయన నటించిన సినిమా ఎన్ని వసూళ్ళు సాధిస్తుందో ఇప్పుడు ప్రత్యక్షంగా ‘అత్తారింటికి దారేది ’ తో తెలుస్తుంది. ఈ కలక్షన్ల సునామీని చూసి, ఆయనకున్న జనాదరణను చూసి పలు భాషల ఇండస్ట్రీలు నివ్వెర పోతున్నాయి. ఈ సినిమాకు వచ్చిన టాక్ ను, బాక్సాఫీసు వద్ద వసూళ్ళతో రికార్డులను బద్దలు కొడుతున్న ఈ సినిమా పై పలు భాషలు కన్నేశాయి. ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేయడానికి పలువురు నిర్మాతలు ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఒక్క తెలుగు ఇండస్డ్రీలోనే ఈ సినిమా ఇన్ని కలెక్షన్లు సాధిస్తే మిగతా భాష్లలో ఎంత సాధిస్తుందో అని లెక్కలేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం తమిళ, హిందీ సినిమాకు చెందిన వారే కాకుండా ఇంకా చాలా మంది పోటీ పడి ఆ చిత్ర నిర్మాతను సంప్రదిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో అయిన విజయ్ ఈ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తితో ఉన్నాడట. ఎవరైనా నిర్మాతలు రీమేక్ హక్కులు కొనుక్కుంటే వారికి డేట్లు ఇచ్చేస్తానని చెప్పడంతో పలువురు తమిళ నిర్మాతలు ప్రసాద్ ఇంటి ముందు క్యూ కడుతున్నారట. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను విజయ్ రీమేక్ చేసి అక్కడ సూపర్ హిట్ లు సాధించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడని అంటున్నారు. మొత్తానికి పవన్ ‘అత్తారిల్లు ’ కి యమ క్రేజ్ ఏర్పడిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles