Trivikaram says suicide is only way

Trivikaram says suicide is only way, Attarintiki Daredi, Trivikram Srinivas, Pawan Kalyan

trivikaram says suicide is only way

ఇక చేసేదేముంది, ఆత్మహత్యే శరణ్యం!

Posted: 09/29/2013 04:33 PM IST
Trivikaram says suicide is only way

పైరసీ పిశాచాన్ని విజయవంతంగా ఎదుర్కొని అత్తారింటికి దారేది చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్న చిత్రబృందం గురించి మాట్లాడుతూ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ మూడు రోజుల నరకాన్ని వర్ణించారు. 

ఒక పక్క సినిమా మొత్తం లీక్ అయినప్పుడు పోలీస్ లను ఆశ్రయించటం జరిగిందని, వాళ్ళు ఎంతో చాకచక్యంతో నేరస్తులను 36 గంటలలో పట్టుకున్నారని త్రివిక్రమ్ చెప్పారు.  అయితే అప్పటికే పంపిణీలో ఉన్న పైరసీ సీడీలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు 24 గంటలు పనిచేసి సంపూర్ణంగా నిలిపివేసారని, అలాగే లింక్ లు డౌన్ లోడ్ చెయ్యకుండా ఆపగలిగారని, నిజంగా ఆ మూడు రోజులు పరిస్థితి చాలా గందరగోళంగా ఉందని చెప్పిన త్రివిక్రమ్, ఆ బాధనంతా ప్రేక్షకులు ఒక్కరోజులో తీసివేసారని అన్నారు. 

సినిమాకు వచ్చిన స్పందన ఇంతవరకూ ఎప్పుడూ లేనిది.  సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు దానిలో ఎంత ఎంజోయ్ చేసారో చెప్పుకుంటున్నారు.  దాని వలన పడ్డ కష్టమంతా ఇట్టే ఎగిరిపోయింది.  కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కలయిక వలన జరిగిన అద్భుతమైతే మరి ఇతర సినిమాల సంగతేమిటని అడగ్గా,

మరి ఇంతే సంగతులు అన్నారు త్రివిక్రమ్.  ఆ పరిస్థితుల్లో మా ఆస్తులన్నీ అమ్మినా తీరని అప్పులో ఉన్న మాకు ఏం చెయ్యాలో తోచలేదు.  మీరు అన్నట్లుగా మరి మిగిలినవాళ్ళ సంగతేమిటంటే, ఉరిపోసుకోవటం తప్ప మార్గం లేదన్నారాయన.  వినటానికి బాధాకరంగా కర్కశంగా ఉన్నా, ఆ పరిస్థితుల్లోంచి బయటకు రాలేనివారు ప్రాణాలు తీసుకోవలసిందే కానీ అంత ఖర్చు పెట్టి తీసిన సినిమా వలన అయిన అప్పులను తీర్చటం ఎవరి తరం కాదు అని బదులిచ్చారాయన. 

అయినా పవన్ కాని నేను కాని ఆ పరిస్థితుల్లో బాధ్యతగా చెయ్యవలసింది చేసాం కానీ అందులో గొప్పేమీ లేదన్నారు త్రివిక్రమ్ నిగర్వంగా. 

త్రివిక్రమ్ మాటలు అంత రుచించకపోయినా ఆలోచిస్తే అందులో ఎంత నిజముందో తెలుస్తుంది.  పైరసీ చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఎన్ని జీవితాలతో ఆడుకుంటుందో ఆలోచిస్తే ఆ పని ఎవరూ చెయ్యరు.  ఆ అవగాహన లేకపోవటమే కారణం కాబట్టి త్రివిక్రమ్ మాటలు అలాంటివారిలో కొంతమందిలోనైనా పరివర్తన తీసుకునిరావచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actor amir khan interest
Powerstar rare picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles