Attarintiki daredi movie leaked cd rs 50 in market

Attarintiki Daredi movie leaked CD Rs 50 in market, Attarintiki daredi online, watch Attarintiki daredi movie online, Attarintiki daredi online, Attarintiki daredi movie online, Pawan Kalyan , Attarintiki Daaredi Movie leaked on the Internet

Attarintiki Daredi movie leaked CD Rs 50 in market

యాబైరూపాలిస్తే అత్తారింటికి దారే(ది) దొరుకుతుంది

Posted: 09/23/2013 01:11 PM IST
Attarintiki daredi movie leaked cd rs 50 in market

ఫైరసీ భూతం ఇప్పుడు అత్తారింటిలో తిరుగుతుంది. పైరసీ భూతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద కన్నేసింది. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కొత్త సినిమా విడుదలకు ముందే మార్కెట్ లో సిడీ ప్రత్యక్షం అయ్యింది. కృష్ణా జిల్లా పెడనలో ఈ సినిమా పైరసీ సీడీ రూ.50కే దొరుకుతుంది. పైరసీ సీడీలపై సమాచారం అందుకున్న పోలీసులు సీడీ షాపులు, సెల్ ఫోన్ రిపేర్ షాపుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పైరసీపై చిత్ర నిర్మాతలు డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సుమారు 80 నిముషాలు నిడివి గల చిత్రం పైరసీ సీడీలో హల్ చల్ చేస్తోంది. పైరసీ భూతం మరోసారి చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పైరసీ సీడీల్లో లభిస్తున్నట్లు సమాచారం. ఈ ఫైరసీ పై మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరో కావాలని చేసి ఉంటారని అభిమానులు ఆవేశంగా మండిపడుతున్నారు. అయితే ఈ సినిమా లీక్ పై టాలీవుడ్ లో సునామీ పుట్టింది. పవర్ స్టార్ సినిమా విడుదలకు ముందే ఇలా ఫైరసీ రూపంలో బయట రచ్చ చేస్తుంటే.. ఇక చిన్న సినిమాల పరిస్థితి ఏమిటని .. చిత్ర నిర్మాతలు, దర్శకులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఫిలింఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని మెగా అభిమానులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles