Mega police power ram charan 6th release

mega police power ram charan 6th release, Mega Power Star Ram Charan, Toofan to release on September 6th, Ramcharan Movie Toofan Confirmed Release Date On 6th, Ram Charan Toofan to release on September 6th

mega police power ram charan 6th release

మెగా పోలీస్ పవర్...!

Posted: 09/03/2013 04:07 PM IST
Mega police power ram charan 6th release

రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తోన్న తొలిహిందీ చిత్రం ‘జంజీర్’. ప్రియాంక చోప్రా కథానాయిక. అపూర్వ లాఖియా దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్-అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ‘తుఫాన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. అమితాబ్ బచ్చన్ నటించిన అలనాటి క్లాసిక్ చిత్రం ‘జంజీర్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ కార్యక్షికమాలు పూర్తయ్యాయి. ‘ఎ’ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘రామ్‌చరణ్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడు. ముంబై నగరాన్ని గడగడలాడిస్తున్న చమురు మాఫియా భరతం పట్టే సమర్థవంతమైన పోలీస్ అధికారి పాత్రలో రామ్‌చరణ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. హిందీ, తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. సెన్సార్ సభ్యులు కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. హిందీలో సంజయ్‌దత్ చేసిన పాత్రను తెలుగులో శ్రీహరి చేశారు. విలన్‌గా ప్రకాష్‌రాజ్ పాత్ర ప్రధానాకర్షణగా వుంటుంది. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమాకు ఇదే తరహా స్పందన లభిస్తుందని భావిస్తున్నాం’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles