No aishwarya rai item song in my film sanjay

aishwarya rai, sanjay leela bhansali, ram leela, himesh reshammiya, masoom, bollywood

Sanjay Leela Bhansali has clarified that there is no truth to rumours that Aishwarya has been roped in for an item song.

ఈమె ఐటెం కాదట

Posted: 08/10/2013 04:49 PM IST
No aishwarya rai item song in my film sanjay

ప్రపంచ అందాల సుందరి ఐశ్వర్య రాయ్ రాయ్ పై ఇటీవలి కాలంలో అనేక పుకార్లు వస్తున్నాయి. త్వరలో ఈమె బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందని, అది ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ప్రముఖ దర్శకుడు అయిన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాం లీలా ’ చిత్రంలో ఐశ్వర్యరాయ్ ఐటెం సాంగులో అలరించబోతుందని, గతంలో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే ఐష్ సంజయ్ కి ఓకే చెప్పిందని వార్తలు సంచరించాయి. కానీ ఈ వార్తల పై స్వయంగా ఆ దర్శకుడే స్పందించాడు. ఐశ్వర్యరాయ్ ఓ ఐటం సాంగ్తో రీఎంట్రీ ఇస్తుందన్న వార్తను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొట్టిపారేస్తూ, ఆ రూమర్సులో ఎలాంటి వాస్తవం లేదని భన్సాలీ స్పష్టం చేశారు. ఐశ్వర్య రాయ్ ఒక బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.  గత కొంత కాలంగా ఐష్ రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలో తన అభిమాన అందాల సుందరిని తెర పై చూసుకోవచ్చని సంబర పడ్డారు. కానీ దర్శకుడే స్వయంగా ఈ విషయం పై తేల్చి చెప్పడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కాగా 1983లో వచ్చిన  ‘మసూమ్‌ ’ సినిమా రీమేక్‌లో ఐశ్వర్య రాయ్‌ నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. చూద్దాం ఐష్ రీ ఎంట్రీ ఎప్పుడుంటుందో ? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles