Catherine tresa romance with junior ntr

Catherine Tresa romance with junior ntr, rabhasa movie, santosh srinivas director, Catherine Tresa new look, Catherine Tresa bumper offer, Catherine Tresa chance

Catherine Tresa romance with junior ntr, rabhasa movie, santosh srinivas director, Catherine Tresa new look, Catherine Tresa bumper offer, Catherine Tresa chance

కేథరిన్ ధెరిస్సాకు బంపర్ ఆఫర్

Posted: 08/10/2013 11:04 AM IST
Catherine tresa romance with junior ntr

లక్ ఉంటే సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సెక్సీ పర్సనాలిటీ, అందాలను ఆరబోయడానికి సిద్దంగా ఉంటే చాలు... కెరియర్ లో చెప్పుకునేంత విజయాలు లేకపోయినా అప్పుడప్పుడు ఆఫర్లు తలుపు తడుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఆఫర్ ఒకటి టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పాగా వేస్తున్న కేథరిన్ దెరిస్సాకు దక్కింది. ఇటీవల ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమాలో బన్నీ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత క్రిష్ణ వంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పైసా ’ సినిమాలో నాని సరసన నటించింది.  ఇద్దరమ్మాయిలతో అనుకున్నంత విజయం సాధించక పోయినా, ఈ అమ్మడుకు మంచి మార్కులే పడ్డాయి. ఫ్యూచర్ లో వెండితెరను ఏలే అందాలు ఉన్నాయని అనుకున్నారు. అలాంటి ఈ భామకు ఇప్పుడు బంపర్ తగిలింది.  

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీర్ సినిమా ‘రబస ’లో సెకండ్ హీరోయిన్ గా ఎంపికయింది. గత కొన్ని రోజుల నుండి రెండో హీరోయిన్ కోసం వెతుకుతుండగా కేధరిన్ పేరు చర్చకు రావడంతో ఈ అమ్మడును సంప్రదించారట. ఎన్టీఆర్ పక్కన అవకాశం అనగానే ముందు వెనక ఆలోచించకుండా ఒప్పేసుకుందట. ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్లు ఉన్నా కెరియర్లో పెద్ద హిట్స్ ఏమి లేకపోయినా ఈ అమ్మడుకే ఎందుకు అవకావం వచ్చిందా అని ఆరా తీసిన సినీ జనాలకు...  అందం, మంచి ఫిగరు ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయని తెలిసిందట. ఇక 'రభస' సినిమా తొలి షెడ్యూలు తాజాగా హైదరాబాదులో జరుగుతుంది. యంగ్ టైగర్ తో సినిమా తరువాత కేధరియన్ కెరియర్ ఊపందుకుంటుందో లేదో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles