Actor manjula vijayakumar passes away

Actor Manjula Vijayakumar death, Manjula Vijayakuma, celebrity,society

amil actress Manjula Vijayakumar, who first appeared as a child artiste in Shanti Nilayam, died in Chennai on Tuesday.

తిరిగిరాని లోకాలకు వెళ్లిన మంజుల

Posted: 07/23/2013 01:44 PM IST
Actor manjula vijayakumar passes away

ప్రముఖ తమిళ, తెలుగు నటి, హీరో విజయ్ కుమార్ సతీమణి అయిన మంజుల (60) తిరిగిరాని లోకాలకు వెళ్ళి పోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంజులు దాదాపు వంద చిత్రాల్లో నటించింది. ఈమె తమిళ నటే అయినా తెలుగు ప్రేక్షకుల చాలా సుపరిచితం. 1969లో తమిళ సినిమా ‘శాంతి నిలయంతో ’సినిమా కెరియర్ ని బాల నటిగా ప్రారంభించి ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లోని ప్రముఖ హీరోల సరసన నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్లు ఎన్టీఆర్‌, అక్కినేని, కృష్ణ, శోభన్‌ బాబుతో పాటు తమిళ దిగ్గజాలు శివాజీ గణేషన్‌, యంజీ రామచంద్రన్‌, జెమిని గణేషన్‌ నటించిన అనేక సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఈమె నటించిన ‘మాయదారి మల్లిగాడు ’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2002లో వెంకటేష్‌ చిత్రం వాసులో ఆమె తల్లిగా నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు . ఈమెకు ముగ్గురు కూతుళ్ళు . ఈమె మరణ వార్త తమిళ సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారి షాక్ కి గురయింది. పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles