Shruti hassan opposite akshay kumar in gabbar

Bollywood news,Shruti Hassan,Gabbar,Akshay Kumar,Sanjay Leela Bhansali,tamanna, sruthi hassan, krish,Ramana,Krish,Bollywood News

According to the latest industry buzz, actress Shruti Hassan, whose Ramaiya Vastavaiya and D-Day are releasing today, has signed another big banner film.

బాలీవుడ్ లో శ్రుతి మరో ఛాన్స్

Posted: 07/22/2013 10:43 AM IST
Shruti hassan opposite akshay kumar in gabbar

కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి ఊపుమీద ఉంది. తాజాగా బాలీవుడ్ లో నటించిన రెండు చిత్రాలు (డీ డే, రామయ్యా వస్తావయ్యా) చిత్రాలు విడుదల అయి మంచి టాక్ తో దూసుకుపోతుండటంతో ఈమెకు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇటు తెలుగులో నటించిన బలుపు కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దర్శక నిర్మాతలు శ్రుతి కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలతో బిజీగా ఉన్న శ్రుతి మిగతా హీరోయిన్లకు ఎసరు పెడుతున్నందని టాక్.

తాజా ఈమె మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా (తమ్మూ) అవకాశాకాన్ని ఈమె లాగేసుకుందని బాలీవుడ్ సమాచారం. విజయకాంత్‌ ప్రధానపాత్రధారిగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో గతంలో విడుదలైన చిత్రం 'రమణ'. ఆ చిత్రం తెలుగులో ఠాగూర్ పేరుతో విడుదలై ఇక్కడా మంచి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక కథాంశంతో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీలో రీమేక్‌ అవుతోంది. అక్షయ్‌కుమార్‌ హీరో . క్రిష్‌ దర్శకుడు. అక్షయ్‌కి జంటగా తమన్నా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం కమల్‌ గారాలపట్టి శ్రుతిహాసన్‌ను చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణవర్గాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో బాలీవుడ్ లో మరో అవకాశం దక్కిందని సంబరపడుతున్న తమ్మూ నవ్వుల పై నీళ్లు చల్లిన శ్రుతికి బాలీవుడ్ లో నాలుగో సినిమా ఎలాంటి ‘లక్ ’ ని ఇస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles