Gunasekhar invested rs 5 crores for anushka

Gunasekhar invested Rs 5 Crores for Anushka, 5 Crores for Anushka Ornaments, Rs 5 crore worth jewellery for rudhramadevi

Gunasekhar invested Rs 5 Crores for Anushka, 5 Crores for Anushka Ornaments, Rs 5 crore worth jewellery for rudhramadevi

అనుష్కకు 5 కోట్ల నగలు

Posted: 07/01/2013 08:49 PM IST
Gunasekhar invested rs 5 crores for anushka

పలు హిట్ సినిమాలు అందించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో ‘రాణి రుద్రమదేవి ‘ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఒక్కో షాక్ ఇస్తున్నాడు. ఇప్పటికే భారీగా ఖర్చుపెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో వేయిస్తంబాల గుడి సెట్ వేయిస్తున్న ఈయన హీరోయిన్ అనుష్క కు సంబంధించిన కాస్టూమ్స్, ఆభరణాల విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. రుద్రమదేవి రాణి పాత్ర కావడంతో ఆమె వివిధ సందర్భాలలో నిండైన ఆభరణాలు ధరించాల్సి వుంటుంది. ఇందుకోసం 5 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేశారట. హిందీలో వచ్చిన 'జోధా అక్భర్' సినిమాకి పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ఈ 'రుద్రమదేవి'కి కూడా పనిచేస్తున్నారు. అయితే ఒక మంచి సినిమా నిర్మించాలని, ఏ విషయంలో రాజీపడకుండా తీస్తున్న గుణశేఖర్ ని మెచ్చుకోవాలి. కానీ గతంలో ఆయన భారీ సెట్స్ వేసి తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అలా కొట్టకుండా కాస్తంత జాగ్రపడి అవసరానికి తగ్గట్లుగా ఖర్చు పెట్టి మంచి సినిమా తీస్తే బాగుంటుందని సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles