Trivikram to direct ram charan next

Trivikram to direct Ram Charan next, ramcharan actor, ramcharan with trivikram, ramcharan with koratala shiva, trivikram and cherry

Trivikram will be soon directing an action flick featuring Ram Charan in the lead. The regular shoot will begin post the release of Atharintiki Daredi.

త్రివిక్రమ్ తో చరణ్

Posted: 06/20/2013 12:35 PM IST
Trivikram to direct ram charan next

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా డైరెక్టర్ కాబోతున్నాడు. ఇప్పటికే పవన్ తో జల్సా,  అల్లు అర్జున్ తో ‘జులాయి ‘ తో సినిమాలు తీసి హిట్టుకొట్టిన ఈయన పవన్ తో మరో చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇక బ్యాలెన్స్ ఉన్న మెగా హీరో రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా కమీట్ అయ్యాడనే వార్తలు ఫిలింనగర్ నుండి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరిగాయని, అవి ఫైనల్ కి వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తరువాత ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుందట. గతంలో త్రివిక్రమ్ రామ్ చరణ్ తో యాడ్ తీసినప్పటి నుండి ఈ వార్తలు షికార్లు చేస్తున్నా, అవి ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడట. రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘ఎవడు' విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత చరణ్ త్రివిక్రమ్ సినిమాలో చేయనున్నాడు. మొత్తానికి మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ రాబోయే రోజుల్లో మెగా హీరోల మెగా డైరెక్టర్ కాబోతున్నాడని సినీ జనాలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles