Pavan real fighting scenes in film

Pavan real fighting scenes in film, real fighting scenes in latest film, trivikram direction, introduction fight, shooting in spain country, martial arts

Pavan real fighting scenes in film, real fighting scenes in latest film, trivikram direction, introduction fight, shooting in spain country, martial arts

పవన్ రియల్ ఫైట్స్ కొత్త సినిమాలో

Posted: 06/19/2013 03:51 PM IST
Pavan real fighting scenes in film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనలో ఉన్న కళలలను ప్రేక్షకులకు చూపించి అలరిస్తాడు. సినీ కెరియర్ మొదట్లో మార్షల్స్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ దానిని తమ్ముడు సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రదర్శించి అలరించాడు. ఆ తరువాత ఖుషి చిత్రంలో తానే స్వయంగా ఫైట్లు కంపోజ్ చేసుకొని మంచి హిట్ సాధించాడు. ఇక ఆ తరువాత నుండి మార్షల్ ఆర్ట్స్ ని ప్రక్కన పెట్టిన పవన్ తాజాగా తనలోని ఆ కళను బయటకు తీసి తను ప్రస్తుతం త్రివిక్రమ్ శీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో తానే స్వయంగా ఫైట్లు కంపోజ్ చేసుకున్నాడని, ఆ సీన్లు సినిమాకే హైలెట్ అవుతాయని ఆ చిత్ర యూనిట్ సభ్యులు నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం స్పెయిన్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. హీరో హెలికాప్టర్ మీద నుంచి లాండ్ అయ్యి...అక్కడ గూండాలతో స్టైలిష్ ఫైట్ తో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని భారిగా ప్లాన్ చేశారు. ఈ సీన్ కోసమే దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారని అంటున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల తరువాత ఓ రెండు పాటల్ని కూడా అక్కడే చిత్రీకరించనున్నారు. మరి పవన్ ఆర్ట్స్ ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పిస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles