Allu arjun next movies with gopichand malineni

Bunny next movies with Gopichand Malineni, Allu Arjun in Gopichand Malineni direction, Linguswamy to direct Allu Arjun

Bunny next movies with Gopichand Malineni, Allu Arjun in Gopichand Malineni direction, Linguswamy to direct Allu Arjun

‘బలుపు ’ దర్శకుడితో బన్నీ

Posted: 06/18/2013 01:39 PM IST
Allu arjun next movies with gopichand malineni

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు నచ్చితే ఏదైనా చేస్తాడు... ఎవరికైనా అవకాశం ఇస్తాడు... ఇటీవల ఈయన నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రం అనుకున్న అంచాల్ని అందుకోకపోయినా, ఏమాత్రం నిరాశకు లోనుకాకుండా బన్నీ సినిమాల మీద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే రేసుగుర్రం చిత్రంలో నటిస్తున్న ఈయన ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటించడానికి కమీట్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో చిత్రానికి కూడా పచ్చజెండా ఊపాడని అంటున్నారు. డాన్ శీను, బాడీగార్డ్ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం రవితేజతో ‘బలుపు ’ సినిమాను తెరకెక్కిస్తున్న గోపిచంద్ మలినేనికి బన్నీ ఛాన్స్ ఇచ్చాడని లేటెస్ట్ ఇన్ఫో. ఇటీవల ఓ ల్యాబ్ లో బన్నీ "బలుపు" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూశారట. అవి ఆయనకు బాగా నచ్చడంతో పాటు, వినోదాత్మకంగా సాగే ఓ కథలో మాస్ అంశాలను మిళితం చేసిన విధానం ఈయన్ని ఆకట్టుకుందట. వెంటనే ఏదైనా ఓ మంచి కథ ఉంటే చెప్పండి సినిమా చేద్దాం అన్నాడట బన్నీ. దీంతో ఎగిరి గంతేసిన గోపిచంద్ బన్నీకి మంచి కథను తయారుచేసే పనిలో పడ్డారట. మరి కొద్ది రోజుల్లో తన ‘బలుపు ’ను చూపించబోతున్న ఈ దర్శకుడు బన్నీని ఎలా చూపిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles