Pavan cinema satellite rights for 9 crores

Pavan Cinema Satellite Rights for 9 crores, Pawan Kalyan upcoming movie Attarintiki daredi, director Trivikram Srinivas, BVSN Prasad, Theatrical rights, 55-65 Crores, SVSC and Baadsha Movie Satellite Rights 7 Crores

Pavan Cinema Satellite Rights for 9 crores, Pawan Kalyan upcoming movie Attarintiki daredi, director Trivikram Srinivas, BVSN Prasad, Theatrical rights, 55-65 Crores, SVSC and Baadsha Movie Satellite Rights 7 Crores

ఈయన ‘అత్తారిల్లు’ రేటు ఎంతంటే...

Posted: 06/14/2013 12:46 PM IST
Pavan cinema satellite rights for 9 crores

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే జనాలకు విపరీతమైన క్రేజ్. దాంతో బయ్యర్లు కానీ, శాటిలైట్స్ రైట్స్ కానీ ఎంత రేటైనా పెట్టి కొనడానికి ముందుకు వస్తారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్స్ రైట్స్ ని మా టీవి వారు తొమ్మిది కోట్ల భారీ రేటు చెల్లించి దక్కించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఈ రేటు ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ సినిమాకు రానంత రేటు రావడంతో సదరు నిర్మాత చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బాద్షా చిత్రాలకు శాటిలైట్ ఏడు కోట్లు పలికాయి. ఇప్పుడు వాటిని మించి పలకడంతో అందరు షాక్ అవుతున్నారు. సాధారణంగా పవన్ సిమాలకు జనాల్లో ఉండే క్రేజ్ , పవన్ సినిమాలకు వచ్చే టీఆర్పీ రేటింగులకు తోడు, త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ కావడమే ఇంత రేటుకు కారణం అంటున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల హక్కులు అమ్మడు పోయిన ఈ సినిమా దాదాపు ఇప్పటి వరకు యాభై కోట్ల పైనే వసూలు చేసిందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల అయితే ఎన్ని చేస్తుందోనని అంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ 20 రోజుల భారీ షెడ్యూల్ నిమిత్తం ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ యూరప్ బయలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles