Actress trisha got big offer in kolywood

Actress Trisha Got Big Offer in Kolywood, Trisha act in Kollywood, Druvanakshetram movie title, Director Goutham Menon, Hero Surya

Actress Trisha Got Big Offer in Kolywood, Trisha act in Kollywood, Druvanakshetram movie title, Director Goutham Menon, Hero Surya

త్రిషకు బంపర్ ఆఫర్ తగిలింది

Posted: 06/13/2013 07:09 PM IST
Actress trisha got big offer in kolywood

చెన్నై చంద్రం త్రిష కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవడమే కాకుండా దాదాపు అన్ని భాషల స్టార్ హీరోల ప్రక్కన నటించింది. ఈ అమ్మడు ఇండస్డ్రీకి వచ్చి దశాబ్దం పైగా అవుతుంది. దీంతో ఈమెను సినిమాల్లో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సినీ జనాలు ఈమె సినిమా కెరియర్ క్లోజ్ అని అనుకున్నారు. కానీ అవకాశాలు లేకుండా పోయే సరికి ఖాళీగా కూర్చుంటున్న త్రిషకు అద్రుష్టం తలుపు తట్టింది. ఈమె గౌతం మీనన్ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. దీంతో త్రిష ఎగిరి గంతేయడమే కాకుండా తెగ ఆనందపడిపోతుంది. ఈ చిత్రానికి పలువురు హీరోయిన్లను అనుకున్నా ఆ పాత్రకు ఈమెనే కరెక్టుగా సరిపోతుందని భావించిన గౌతమ్ మీనన్ ఈ అమ్మడుకు ఆఫర్ ఇచ్చాడు. తమిళంలో ఈ సినిమా పేరు ‘ధృవ నట్చితిరం’గా రాబోతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్లో ‘ ధృవనక్షత్రం ’ పేరుతో రాబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 17 నుండి ప్రారంభం కాబోతుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో త్రిష పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందట. ప్రస్తుతం త్రిష ఎం.ఎస్ రాజు తీస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమా త్రిష కెరియర్ ని మళ్ళీ గాడిలో పడేస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles