Action 3d release postponed to june 21

Action 3D film. Allari naresh Action 3D movie, Action 3D movie release postponed, June 21

llari Naresh Action 3D release got postponed. The high-budget movie Action 3D was actually set for release on June 14th but it been extended for another week for release.

యాక్షన్ 3డి మళ్లీ వాయిదా

Posted: 06/11/2013 06:53 PM IST
Action 3d release postponed to june 21

అల్లరి నరేష్ తొలిసారిగా ‘యాక్షన్ ’ 3డిలో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిక్ శ్యాం, వైభవ్, తదితరులు ప్రధాన పాత్ర దారులుగా రూపొందుతున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడిన ఈ చిత్రాన్ని చివరగా ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ సెన్సార్ బోర్డు వాళ్లు చేస్తున్న ఆలస్యం కారణంగా ఈ చిత్రాన్ని ఈనెల 21కి అంటే మరో వారం రోజులు వాయిదా వేశారు. అనిల్ సుంకర్, రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2డి తోపాటు, 3డిలో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం వాయిదా పడటానికి ఫిలిం నగర్ నుండి వేరే వార్తలు వినబడుతున్నాయి. ఈనెల 14వ తేదిన ఏకంగా 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకవేళ జనాలకు ఈ చిత్రం నచ్చకపోతే కలెక్షన్ల పై ప్రభావం చూపుతుందని భావించి విడుదలను వాయిదా వేశారని అంటున్నారు. మరి 21 వ తేదీనైనా విడుదల అవుతుందో లేదో చూడాలి. భారతీయ సినీ రంగ చరిత్రలో 3డిలో రూపొందిన తొలి కామెడీ చిత్రం ఇదేకావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles