Tvs motor inducts mahesh babu as brand ambassador

TVS Motor Company, Mahesh Babu, Mahesh Babu brand ambassador for TVS Motors, Indian cricket captain M.S. Dhoni, Virat Kohli, actress Anushka Sharma, TVS Phoenix, ,Companies,T V S Motor Company Limited

TVS Motor Company inducts Bollywood/Tollywood star Mahesh Babu as its brand ambassador.

మహేష్ కూడా టీవీఎస్ కు బ్రాండ్ అంబాసిడర్

Posted: 06/08/2013 12:31 PM IST
Tvs motor inducts mahesh babu as brand ambassador

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా గానే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయనకు టాలీవుడ్ లో ఏ హీరో చేయనన్ని బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. తాజాగా ఈయన ఖాతాలోకి మరోటి వచ్చి చేరడమే కాకుండా ప్రముఖ క్రికెట్లర్లు అయిన ధోని, కోహ్లీలకే సవాల్ విసురుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే... ప్రముఖ దేశీయ మోటార్ సైకిల్ కంపెనీ అయిన టీవీఎస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ధోని, కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రచారం చేస్తున్నారు. ఇఫ్పుడు వీరి సరసన మహేష్ కూడా చేశారు. ఈ కంపెనీ తాజాగా విడుదల చేసిన Phoenix బైక్‌కు ఆయన ప్రచారం చేయడానికి ఈయనను నియమించుకున్నారు. మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వల్ల తమ అమ్మకాలు పెరుగుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ ప్రతినిధులు.

మహేష్ బాబు ఇప్పటికే అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మహింద్రా ట్రాక్టర్, థమ్సప్, సంతూర్, ఐడియా, వివెల్ షాంపూ, రాయల్ స్టాగ్, జోయ్ అలుకాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. అయితే ఈ డీల్ కు మహేష్ భారీగానే పుచ్చుకున్నాడని తెలుస్తుంది. మహేస్ రాకతో ఇప్పటికే అనేక సంస్థలకు ప్రచారం చేస్తున్న ధోని, కోహ్లీలకు ఎక్కడ దెబ్బ వస్తుందేమో అనే భయంతో ఉన్నారు. మొత్తానికి ఒక హీరో క్రికెటర్లకు సవాల్ విసరడం అంటే ఇదే. మరో వైపు అటు వరుస సినిమా హిట్లతో మహేష్ బాబు టాప్ రేంజిలో దూసుకుపోతుండటమే కాకుండా టాలీవుడ్లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఈయనే ముందున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles