Sridevi to host kbc telugu tv show

Sridevi telugu tv,Sridevi KBC,sridevi English Vinglish,English Vinglish tv host,

Sridevi to host KBC Telugu TV show.

అతిలోక సుందరి తెలుగులో

Posted: 06/07/2013 02:08 PM IST
Sridevi to host kbc telugu tv show

అతిలోక సుందరిగా పేరొందిన శ్రీదేవి హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎన్ని అందాలు ఉన్నాయో, ఇప్పటికీ అవే అందాలను మెయింటేన్ చేస్తుంది. పెళ్లి చేసుకొని దశాబ్దానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈమె ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి, ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించి తనలోని నటన ఏ మాత్రం చావలేదని నిరూపించుకుంది. ఈమె నటనకు దాసోహం అయిన తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ లో కూడా నటిస్తే బాగుండని అనుకున్నారు. కానీ ఈ విషయంలో నిరాశే ఎదురైంది. అలా ఆశపడ్డ కోరిక త్వరలో నెరవేర బోతుంది. ఈ అమ్మడు త్వరలో ఓ ప్రముఖ తెలుగు ఛానల్ నిర్వహించబోయే ఓ ప్రోగ్రామ్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇది ’అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి ’ కి తెలుగు వెర్షన్ లో ఈమెను తీసుకోనున్నారట. ప్రోగ్రాం త్వరగా పబ్లిసిటీ కావాలనే ఉద్దేశ్యంతో శ్రీదేవిని సంప్రదించారని దానికి శ్రీదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఒక్కో ఎపిసోడ్ కి భారీగా పారితోషికం ముట్టజెప్పడానికి కూడా ఆ ఛానల్ రెడీగా ఉండటంతో శ్రీదేవి నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఏమైతేనేం తెలుగు ప్రేక్షకులు అతిలోక సుందరిని బుల్లితెర పై చూడబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles