Movie news shruti hassan plays karachi prostitute in d day

shruti hassan d day hot pics, shruti hassan d day hot stills, shruti hassan d day hot photos, shruti hassan as prostitute in d day, shruti hassan d day hot, d day photos, shruti hassan prostitute, kamal hassan, mark on her face, character of suraiya, kamal haasans darling daughter shruti haasan, silver screen on 19th july 2013.

shruti hassan plays karachi prostitute in d-day

మందారం బుగ్గల్లో కమల్ మచ్చ!

Posted: 05/30/2013 01:11 PM IST
Movie news shruti hassan plays karachi prostitute in d day

నిగనిగలాడే శ్రుతిహాసన్ బుగ్గలు భలే ఉంటాయి. కానీ, ఇటీవల కుడి బుగ్గ మీద ఓ పొడవాటి మచ్చ ప్రత్యక్షమైంది.కూతురు శృతిహాసన్ ముఖంపై కమల్ హాసన్ కత్తితోనో, కర్రతోనో, ఇంకేదో ఆయుధంతోనో వేసిన గాటు కాదిది. ‘డి-డే’ చిత్రంలో పాత్ర పరంగా శృతిహాసన్ ముఖంపై ఓ గాటు కనిపించాలి. గాయం వల్ల ఏర్పడిన గాటుగా కనిపించేందుకు కమల్‌హాసన్ సహకరించారట... అదీ సంగతి. ‘చాచీ 420’లో మహిళగా, ‘హే రాం’ చిత్రంలో విభిన్న మేకప్‌లతో కనిపించిన కమల్, శృతి ముఖంపై గాటు నిజమైనదానిలా కనిపించేందుకు తన అనుభవాన్ని ఉపయోగించారని సినీ వర్గాల సమాచారం. అనేక చిత్రాల్లో వివిధ గెటప్‌లలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన కమల్ తన కూతురు కూడా ప్రేక్షకుల మన్నన పొందేందుకు తనవంతు సహకారం అందచేశారు.

డి-డే చిత్రంలో శ్రుతి హాసన్ సురయ్యా అనే వేశ్య పాత్రలో నటిస్తోంది. సినిమా ఫ్లాష్‌బ్యాక్, సురయ్యా గతంలో ఆమె ముఖం కుడివైపు చెంపపై ఓ గాటు ఉంటుంది. ఆమె 16 ఏళ్ల వయస్సులో వ్యభిచార వృత్తిలోకి అడుగుపెట్టినప్పుడు ఓ గాయం అవుతుంది. ఓ తార్పుడుగాడు చేసిన గాయం వల్ల ఆ గాటు ఏర్పడుతుందని డి-డే చిత్ర వర్గాలు తెలిపాయి. ఆ గాటు నిజమైనదిలా కనిపించేందుకు కమల్‌హాసన్ సహకరించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పాత్ర చిత్రీకరణ కోసం తండ్రీ కూతుళ్లు తీవ్రంగా శ్రమించారని తెలిపాయి. గాటు రంగు, లోతు, వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పు వంటి అన్ని విషయాల్లో వీరిద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపాయి. ఇటీవల విడుదలైన డి-డే సినిమా ట్రెయిలర్‌ను చూసిన వారు శ్రుతి ముఖంపై గాయం నిజమైనదిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles