Om movie audio release

om audio release, kalyan ram, kriti karbanda, nandamuri harikrishna, dasari naryana rao, sirivennela sitarama sasthry

om movie audio release

ఓం ఆడియో విడుదల

Posted: 05/26/2013 12:06 PM IST
Om movie audio release

నిన్న రాత్రి కళ్యాణ్ రామ్ నటించిన ఓం సినిమా ఆడియో విడుదల వేడుకగా జరిగింది. 

సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్, నందమూరి హరికృష్ణ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాల్గొన్నారు.  మొదటి సిడిని కళ్యాణ్ రామ్ కూతురు చేతుల మీదుగా దాసరి నారాయణరావుకి అందించారు. 

ఓం సినిమాకి సంగీతాన్ని సాయి కార్తిక్, అచ్చు సమకూర్చారు.  కృతి కర్బందా, నిఖిషా పటేల్ హీరోయిన్లుగా పనిచేస్తున్నారు.  3డి లో అత్యంత వ్యయానికోర్చి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా కళ్యాణ్ రామే.  సునీల్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 

3డి కాబట్టి పోరాటాలు సాహసాలుతో కూడిన చిత్రమని తెలుస్తూనేవుంది.  ఇంతవరకూ చెప్పుకోదగ్గ సినిమా అంటూ లేని కళ్యాణ్ రామ్ ఈ సినిమా మీద అంచనాలు బాగా వేసుకున్నారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles