Parineeti chopra to pair up with mahesh

Parineeti Chopra in Mahesh Babu movie, Parineeti Chopra in Aagadu movie, mahesh babu Parineeti Chopra in Aagadu, Parineeti Chopra to act with mahesh.

Bollywood glam girl and Priyanka Chopra’s sister Parineeti Chopra will be pairing up with Mahesh Babu in his upcoming movie, Aagadu. The movie’s post production work is on and the regular shooting will begin from July. The makers are planning to rele.

పరిణితి చోప్రా పై మనస్సు పారేసుకున్నాడు

Posted: 05/06/2013 11:52 AM IST
Parineeti chopra to pair up with mahesh

సినిమా ఇండస్ట్రీకి రోజు రోజుకు ఎంతో మంది కథానాయికలు దిగుమతి అవుతున్నా, ఎప్పుడు హీరోయిన్ల కొరత ఉండనే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ కి. మన టాలీవుడ్ లో ఎంతో మంది కొత్త కథానాయికలు ఉన్నా, హీరోలు, సినీ జనాలు కొత్త అందాలనే కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకులు వేటాడి వెంటాడి పట్టుకుంటున్నారు. భాష అయినా సరే అమ్మడులో సరుకు ఉంటే టాలీవుడ్ దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటింపజేయడానికి దర్శకుడు శీనువైట్ల ఓ అమ్మాయిని కాకపడుతున్నాడట. ఆమె ఎవరో కాదు... బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా చెల్లెలు అయిన పరిణితి చోప్రా. ఈమె తన అక్కబాటలోనే నడుస్తూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె అందానికి ఫిదా అయిన మహేష్ మనస్సు పారేసుకోవడమే కాకుండా, ఎలాగైనా ఈమెను తన సినిమాలో పెట్టుకోవాలనుకొని శీనువైట్లతో అనడంతో ఆయన పరిణితి చోప్రాతో చర్చలు కూడా జరుపుతున్నాడట. బాలీవుడ్ లో పలువురు యువ కథానాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న పరిణీతి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. అయితే సినీ జనాలు మాత్రం పరిణితి చోప్రాకు బంపర్ ఆఫర్ తగిలిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles