Sridevi as prabhas mother in bahuballi

sridevi, bahubali, rajamouli, prabhas, susmita sen, tabu, rana, sudeep,bahuballi,prabhas,rajamouli,movies,

Rajamouli is giving surprises after surprises regarding Bahubali cast. Besides to Prabhas, he roped in Rana. He even brought Sudeep into the picture.

ప్రభాస్ కి తల్లిగా అందాల తార శ్రీదేవి ?

Posted: 04/25/2013 01:13 PM IST
Sridevi as prabhas mother in bahuballi

ఒకప్పటి అందాల తారామణులు ఇప్పటి హీరోలకు తల్లి పాత్రలలో కనిపించి వెండి తెర పై మళ్లీ తళుక్కుమంటున్నారు. జయసుధ, సుహాసిని లాంటి వాళ్లు ఎప్పటి నుండో అలాంటి పాత్రలు వేస్తుంటే.... ఎప్పుడో వెండితెరకు దూరం అయిన శ్రీదేవి, నదియా, రమ్యక్రిష్ణ లాంటి వాళ్లు మళ్లీ రంగేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల సుందరి శ్రీదేవి దాదాపు 15 సంవత్సరాల తరువాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్ ’ సినిమాలో నటించి తనలోని నటనా ఏ మాత్రం చావలేదని నిరూపించింది. ఇక నదియా కూడా ఈ మధ్య ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో అతనికి తల్లిగా నటించి మెప్పించింది, ఇప్పడు పనన్ కళ్యాణ్ కి అత్తగా కూడా కనిపించబోతుంది.

ఇక తాజాగా టాలీవుడ్ ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబళి ’ సినిమాలో ప్రభాస్, రాణా లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ కి తల్లిగా అందాల తార శ్రీదేవి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల పేర్లను పరిగణలోకి తీసుకున్నాడట. అయితే వీరిద్దరిలో ఎవర్ని ఎంపిక చేయాలో రాజమౌళి తేల్చుకోలేక పోతున్నాడట. ఎందుకంటే వీరిద్దరు నటనలో, పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఇద్దరు కోటికి పైగా డిమాండ్ చేస్తున్నారట. మొత్తంగా చూస్తే ఇటీవలే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. ఒకవేళ ఇదే గనుక కరెక్ట్ అయితే పెద్ద సెన్సేషన్ అవుతుందని అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh