ఫ్యామిలీ హీరోగా తెలుగుచలన చిత్ర సీమలో తన స్థానం సుస్థిరం చేసుకున్న హీరో జగపతిబాబు పుట్టిన రోజు ఇవాళ. అసలుపేరు వీరమాచనేని జగపతి చౌదరి, ఫిబ్రవరి 12వ తేదీ 1962లో మచిలీపట్నంలో పుట్టాడు. తండ్రి ప్రముఖ నిర్మాత విబి రాజేంద్రప్రసాద్. వైజాగ్ లో ఫర్నీచర్ షాప్ ను నిర్వహించే జగపతి బాబు.. తన స్నేహితుడైన నాగార్జునను స్పూర్తిగా తీసుకుని వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. హిందీలో హిట్ అయిన 'ఖత్రోంకే ఖిలాడి' చిత్రం రీమేక్ 'సింహ స్వప్నం' చిత్రంతో, సొంత బ్యానర్ అయిన 'జగపతి పిక్చర్స్' ద్వారా అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాలోనే ఆయన ద్విపాత్రాభినయం అనే సాహసం చేసినప్పటికీ విజయం మాత్రం కనికరించలేదు. ఆ తరువాత చేసిన సినిమాలు కూడా పరాజయాల బాటలోనే వెళుతున్న సమయంలో, 'పెద్దరికం' జగపతిబాబుకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో కృష్ణ మోహన్ పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తరువాత ఆయన చేసిన 'గాయం' ... యాక్షన్ హీరోగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.
ఇక ఆ తరువాత వచ్చిన 'శుభలగ్నం', 'మావిచిగురు', 'శుభాకాంక్షలు' వంటి చిత్రాలు జగపతిబాబును పూర్తి స్థాయి ఫ్యామిలీ హీరోను చేశాయి. ఇద్దరు కథానాయికల కథానాయకుడిగా శోభన్ బాబు తరహా పాత్రలను ఎక్కువగా చేసి మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన గెలుచుకున్నారు. ఈ సమయంలో ఆయన రొటీన్ కి భిన్నంగా చేసిన 'అంతఃపురం' చిత్రంలోని పాత్ర ఆయన నటనలోని పరిపక్వతకు అద్దం పట్టింది. అనంతరం 'పెదబాబు', లక్ష్యం', 'సామాన్యుడు' వంటి మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి.
ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానని మీకు ఏ సినిమా చేసిన తర్వాత అయినా అనిపించిందా అని అడిగితే, కొన్ని సినిమాల విషయంలో అలా జరిగిందని తన మనసులో మాట బయటపెట్టారు జగపతిబాబు. ఏ విషయాన్నైనా దాపరికంలేకుండా చెప్పగలిగే హీరో జగపతిబాబుకి తెలుగువిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more