Kamal hassans viswaroopam banned

Kamal Hassan's 'Viswaroopam', Viswaroopam movie banned, Viswaroopam teaser, Viswaroopam posters, kamal hassan, tamilnadu government, viswaroopam posters, viswaroopam dth

Kamal Hassan's 'Viswaroopam' banned

1.gif

Posted: 01/24/2013 10:34 AM IST
Kamal hassans viswaroopam banned

Viswaroopam-Reservation-starts-today-Poster

       నేను చూపించాల్సిన విశ్వరూప సందర్శన యోగం.. వీడు చూపిస్తానంటాడేంటి అనుకున్నాడో ఏమో.. భగవంతుడు. ఫలింతంగా విలక్షణ నటుడు  కమలహాసన్  విశ్వరూపాన్ని ప్రజలకు చూపించేందుకు అనేక అవాంతరాలు కల్పిస్తున్నాడు. ఇదే ఫీలింగ్ ఇప్పుడు కమల్ మనసుని కలిచివేస్తుంది.
       తమిళనాడు ధియేటర్ల యాజమాన్యాలతో తలనొప్పితెచ్చిపెట్టిన డీటీహెచ్ వివాదం సమసిపోయి, ఈ సినిమా రేపు (జనవరి 25) న విడుదలకు సిద్ధమవుతుండగా ... ఈ రోజు ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం రెండు వారాల పాటు విడుదల కాకుండా, నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం తమను కించపరిచేలా వుండచ్చన్న ఉద్దేశంతో తమిళనాడులోని (తమిళనాడు ముస్లిం మున్రేట్ర కళగం) సహా ముస్లిం వర్గాలు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో కమల్ కు ఈ విపత్తు వచ్చిపడింది.
    కాగా,  చిత్రాన్ని నిషేదించాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించిన మీదట, ఈ రోజు నిషేధపు ఉత్తర్వులను విడుదల చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి.
     ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ భారీ చిత్రం ఎన్నో అడ్డంకులను దాటి రిలీజ్ కు రెడీ అవుతోన్న తరుణంలో తలెత్తిన ఈ హఠాత్పరిణామానికి కమలహాసన్ పెద్ద షాక్ కు గురయ్యారు. అంతేకాదు ఈ మూవీలో మతసామరస్యాన్ని దెబ్బతీసే ఏ సన్నివేశాలు లేవని కమల్ వాపోయారు. నిషేదం మీద చెన్నైలో కమల్ మీడియాతో మాట్లాడారు.  తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. చిత్రంలో ఏ మతం మనోభావాలను కించపరచలేదని స్పష్టం చేసారు. ఎవరినీ తప్పుగా చూపించలేదన్నారు. జాతీయ దృక్పధం వున్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆమోదిస్తారని అన్నారు.  
         ఇదిలా ఉండగా,  ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 25 న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ  భాషాల్లో ఆయన విడుదల చేయాలని భావించారు.  ఈ నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖుల కోసం ఇవాళ (ఈ నెల 24 న) అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు  ఫిబ్రవరి 2 నుంచి ఈ సినిమా డీటీహెచ్ లో ప్రదర్శించబడాల్సి ఉంది. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైందని కమల్ చింతిస్తున్నట్టు వినికిడి.

       కమల్ హాసన్ రచించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ – ఎహాసన్ – లాయ్ సంగీతం అందించారు. పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్ ఈ చిత్రంలో కమల్ హసన్ తో పాటుగా ప్రధాన పాత్రలు పోషించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay leela bhansali ramleela movie firstlook
Mr pellikoduku theater trailer super  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles