Case no6662013 telugu movie update

Case No.666/2013 telugu movie, hero aditya, anurag, Case No.666/2013 telugu movie teaser, Case No.666/2013 telugu movie wallpapers, Case No.666/2013 telugu movie casting, Case No.666/2013 telugu movie news

Case No.666/2013 is an upcoming telugu film starring Aditya, Anurag,

8.gif

Posted: 01/19/2013 03:52 PM IST
Case no6662013 telugu movie update

cas

        తెలుగు చలన చిత్ర పరిశ్రమ మారుతున్న కాలనుగుణంగా కొత్తపుంతలు తొక్కుతోంది. 80 ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో నవకల్పనలు తనలో ఇముడ్చుకున్న తెలుగు సినీ కళామతల్లి ఇప్పటి వరకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. నవీనపోకడలను ఆపాదించుకుంటూ తాజాగా, ఫౌండ్ ఫూటేజ్ టెక్నాలజీతో తొలిసారిగా తెలుగులో కేస్ నెం.666/2013 అనే సినిమా తెరకెక్కుతోంది.
       ఇంతకుముందు ఇదే తరహాలో హాలీవుడ్లో ‘పారానార్మల్ ఆక్టివిటీ’, బాలీవుడ్లో రాగిణి ఎంఎంఎస్, లవ్ సెక్స్ ఔర్ ధోకా సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీని ఈ మూవీ దర్శక,నిర్మాతలు తెలుగుకి పరిచయం చేయబోతున్నారు. 
      ఇక కథాంశం ఏంటంటే.. దెయ్యాలు లేవు అని నిరూపించడానికి ముగ్గురు యువకులు అడివిలో ఉన్న ఒక పాడుబడ్డ భవంతిలోకి వెళ్లి అక్కడ తమ అనుభవాలు చిత్రీకరిస్తారు. ఆ తరువాత వారిలో ఒక్కొక్కరు మాయమవుతుంటారు. ఇవన్ని కెమెరాల్లో రికార్డు అవుతాయి. ఆవారు ఎలా మాయమయ్యారు అనేది సినిమా మిగతా కథ.
       డిసెంబర్ 23న షూటింగ్ ప్రారంభించిన ఈమూవీని జనవరి 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘జింగ్రీల్’ ద్వారా ఇంటర్నెట్లో అందరూ ఈ సినిమాని వీక్షించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి  దర్శకుడు వెంకట్ సిద్ధార్థ్ రెడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli says about ongole gitta movie
Dil raju next movie lover  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles