Pune international film festival 2013

Pune International Film Festival 2013, film festival, Pune International Film Festival 2013 stars, Pune International Film Festival 2013 news, Pune International Film Festival,

Pune International Film Festival 2013 From 10th-17th January 2013

10.gif

Posted: 01/15/2013 04:43 PM IST
Pune international film festival 2013

pu

       పుణెలో 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ దిగ్గజాల్ని ఈ వేడుకల్లో సన్మానించారు. జతేంద్రకి, రమేష్ డియోకీ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ని ప్రకటించారు. బాలీవుడ్ సినీ దిగ్గజాలు మోహన్ అగస్టీ, ముక్తా బార్వీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సుభాష్ ఘాయ్, సౌండ్ డిజైనర్లు.. రేశుల్, జబ్బర్ పటేల్ లతోపాటు పుణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
          సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్ కుమార్ శర్మ, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాలను ఎస్.డి.బర్మన్ పురస్కారంతో సత్కరించారు. సిల్ సిలా అనే సినిమా తీసేటప్పుడు లెజెండరీ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా మమ్మల్ని గుర్తుచేసుకోవడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమాకి మమ్మల్ని సంగీతం అందించమని ఆయన కోరినప్పుడు చాలామంది ఈయనకేమైనా అయ్యిందా అనికూడా అనుకున్నారు. ఇంత పెద్ద సినిమా తీస్తూ శాస్త్రీయ సంగీతకారుణ్ణి మ్యూజిక్ డైరెక్టర్ గా  పెట్టడమేంటనుకున్నారు. కానీ.. యశ్ గారికి మా మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నా.
         పుణే ఫిల్మ్ ఫెస్టివల్ కి యాభై దేశాలనుంచి 80 సినిమాలు ప్రదర్శనకు వచ్చాయి. వీటిలో ఇటాలియన్ డైరెక్టర్ మైకెలాంజిలో ఆంటోనీ, ఫ్రెంచ్ డైరెక్టర్ క్లాడీ ఛాబ్రల్ , స్మితా పాటిల్ తీసిన ఫీచర్ ఫిల్మ్ లు కూడా ఉన్నాయి. ఎల్లుండు (జనవరి పదిహేడు) వరకూ ఈ ఫిలింఫెస్టివల్ జరుగుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan upasana sankranthi celebrations
Akkineni speech at madhu film n tv institute celebration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles