కొంచెం సేపటిక్రితం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్ మీట్ జరిగింది. సినిమాను ఈనెల 11 రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పెళ్లి సందర్భంలోని పాటను విడుదల చేశారు. విడుదలైందే తడవుగా ఈ పాటకు విపరీతమైన ఆదరణ కనిపిస్తుంది. ఎంతో ట్రెడిషనల్ గా, కలర్ ఫుల్ గా, ప్లజంట్ గా రిచ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ అందరి మెప్పునూ పొందుతోంది. నెట్ లో అప్పుడే హల్ చల్ మొదలైపోయింది ఈ పాట గురించి.. దిగువకనిపిస్తోన్న ఈ సాంగ్ అదే..
ఇంకా, ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఇంకా ఏమన్నారంటే.. ‘జనవరి 11 అమావాస్య కావడం వల్ల జనవరి 10 రోజు సాయంత్రమే ప్రీమియర్ షో వేస్తున్నాం. అది ఒక్క షోనా లేక ఎక్కువ షోలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆ విషయాన్ని త్వరలోనే తెలియజేస్తాం. త్వరలోనే మూవీని సెన్సార్ కు పంపించనున్నాం.’ అని వెల్లడించారు. అంటే అనుకున్న సమయానికి కొన్ని గంటల ముందునుంచే సీతమ్మ వాకిట్లో సందడి షురూ అన్న మాట.
విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. సమంత – అంజలి హీరోయిన్స్. మిక్కీ జె మేయర్ మ్యూజిక్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more