దాదాపు 20ఏళ్ల క్రితం తన తండ్రి నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ మూవీ 'హలో బ్రదర్'ని రీమేక్ చేసేందుకు నాగచైతన్య జోరుగా సన్నాహాలు సాగిస్తున్నాడు. నాగార్జునతో 'ఢమరుకం' చిత్రాన్ని రూపొందించిన శ్రీనివాసరెడ్డి దీనికి దర్శకుడు. చైతు పక్కన ప్రజంట్ డేస్ హాట్ హాట్ బ్యూటీస్ సమంతా, తమన్నా కథానాయికలుగా నటించబోతున్నారు. అప్పట్లో నాగ్ సరసన సౌందర్య, రమ్యకృష్ణ అల్లాడించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
అంతేకాదు.. 'హలో బ్రదర్' లోని 'కన్నె పిట్టరో... కన్ను కొట్టరో', 'ప్రియరాగాలే.... గుండెలోన పొంగుతున్న ఈవేళ' వంటి రెండు హిట్ నెంబర్స్ ను ఇందులో రీమిక్స్ చేయబోతున్నారు. దీనిపై స్పందించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాత్రం ఇందులో చైతన్య రెండు పాత్రలను పోషిస్తున్న సంగతి నిజమేననీ, కానీ, ఇది 'హలో బ్రదర్' రీమేక్ కాదంటున్నాడు.
ఈ సంగతటుంచితే, త్వరలో తమన్నాతో పాటు చైతూ తో చిందేయనున్న సమంతా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం తీసుకుంది. ఈ ముద్దుగుమ్మ మరింత అందం కోసం 'రినోప్లాస్టి' అనేసర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే.. వెండితెరపై తిరుగులేకుండా వెలిగిపోతోన్న సమంత అందానికి ఏం తక్కువొచ్చింది.. అనుకుంటున్నారా.. అవును నిజమే.. అయితే, తీరైన ఆ ముక్కును మరి కాస్త సరి చేయించుకుంటే మరింత అందంగా ఉంటావని సన్నిహితులు చెప్పటంతో నిజమే అని తోచి ఈ యత్నానికి దిగింది తమంతా.
ఇటీవలే ఈ తరహా సర్జరీ చేయించుకున్న మరో కథానాయిక శృతి హాసన్. గతంలో శ్రీదేవి కూడా ఈ సర్జరీ చేయించుకున్న తరువాత కెరియర్ పరంగా మరింత స్పీడుతో ముందుకు దూసుకు వెళ్లిన సంగతి ఇక్కడ గమనార్హం. ఏమైనా.. నాగచైతన్య సినిమా నాటికి తన ముక్కుపని ముగించుకుని వెండితెరపై కొత్త లుక్ తో కనిపించాలని సమంతా భావిస్తుందని వెల్లడి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more