Ko ante koti movie audio review

ko ante koti audio review, ko ante koti teaser, ko ante koti wallpapers, ko ante koti stills, ko ante koti sharvanand, ko ante koti srihari, ko ante koti anish kuruvill, ko ante koti priya anand, ramcharan launch audio, priya anand hot pics

ko ante koti movie audio review

15.gif

Posted: 12/12/2012 12:44 PM IST
Ko ante koti movie audio review

కో అంటే కోటి ఆడియో రివ్యూ

         డిఫరెంట్ యాటిడ్యూడ్ తో ముందుకు సాగే  యంగ్ హీరో శర్వానంద్ తన సొంత ప్రొడక్షన్ శర్వా ఆర్ట్స్ బ్యానర్ పై ‘కో అంటే కోటి’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా ఆడియో ఇటీవలే రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన సంగతి మనకు తెలుసు. ప్రియ ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిష్ కురువిల్ల దర్శకత్వం వహించాడు. శక్తి కాంత్ కార్తీక్ మ్యూజిక్ అందించిన ఈ పాటలు.. సంగీతం ఎలా ఉన్నాయో చూద్దాం..

ko_ante_koti_new_movie-inne
1) పాట : కో అంటే కోటి
గాయకుడు : సూరజ్ జగన్
రచయిత : బి.ఆర్.కె
          సాలిడ్ సాంగ్ ఇది. వింటూ ఉంటే ఈ పాట చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ ‘కొండవీటి సింహం’ నుండి ‘ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్’ డైలాగ్ అలాగే ఎస్.వి రంగారావు గారు ‘జగత్ జెట్టీలు’ లో చెప్పిన ‘డోంగ్రే’ డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది.  సూరజ్ జగన్ వాయిస్ పాటకు ఆప్ట్ అయింది.
2) పాట : ఓ మధురిమవై
గాయకుడు : నరేష్ అయ్యర్
రచయిత : శ్రేష్ఠ
           ఆడ, మగ అందరికీ నచ్చేలా నెమ్మదిగా సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. నరేష్ అయ్యర్ గాత్రం బావుంది. శ్రేష్ఠ సాహిత్యం కవితలా సాగింది. మొత్తంగా పాట చాలా వినసొంపుగా ఉంది.
3) పాట : వరాల వాన
గాయనీ గాయకులు : హరి చరణ్, ప్రియ హేమేష్
రచయిత : వసిస్థ శర్మ
       ఈ డ్యూయెట్ సాంగ్.. హరి చరణ్, ప్రియ హేమేష్  గొంతుతో మరింత మధురమైంది. వసిస్థ శర్మ లిరిక్స్ క్లాసికల్ గా ఉన్నాయి.  సౌండ్ ట్రాక్ వెరైటీ.  ప్రియ హేమేష్ వాయిస్ కీలకం.
4) పాట : బంగారు కొండ
గాయకుడు : హరిణి
రచయిత : శ్రేష్ఠ
    3 నిమిషాల 15 సెకన్లు మాత్రమే సాగే  చిన్న బిట్ సాంగ్ ఇది. హరిణి వాయిస్ చాలా సూపర్బ్. శ్రేష్ఠ సాహిత్యం ఆధ్యాత్మిక భక్తి ఫీల్ ఇస్తుంది. కార్తీక్ ఈ పాటను చాలా క్వాలిటీగా అందించాడు.
5) పాట : ఆగిపో
గాయనీ గాయకులు : కార్తీక్, శ్వేతా మోహన్
రచయిత : వసిస్థ శర్మ
        ఈ రొమాంటిక్ డ్యూయెట్లో కార్తీక్–శ్వేతా మోహన్ కాంబో సింగింగ్ బాగుంది. ట్రెడిషనల్ వాయిద్యాలతో మ్యూజిక్ చాలా మెలోడీగా ఉంటుంది. వసిస్థ శర్మ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయనిపిస్తుంది వింటుంటే..
6) పాట : దేహం దేహం
గాయకుడు : శక్తి కాంత్ కార్తీక్
రచయిత : బి.ఆర్.కె
        మియామి పోలీసుల రేడియో చాటర్ సౌండ్ తో ఆరంభమయ్యే ఈ పాటలో బి.ఆర్కె లిరిక్స్ హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి, మొత్తం సినిమాకి థీం సాంగ్ ఇది. లిరిక్స్ కి తగ్గట్టుగా శక్తి కాంత్ మ్యూజిక్  డీసెంట్ గా ఉంది.
మొత్తంగా ఇలా ఉన్నాయ్ :
   కొంతమేర రామ్ గోపాల్ వర్మ సినిమా పాటలు గుర్తుచేశాలా సాగే ఈ చిత్రం లోని అన్ని పాటలు సూపర్బ్ ఫ్రెష్ అప్పీల్ కలిగించేవే. యూత్ ఈ సాంగ్స్ కి బాగా యట్రాక్ట్ అవుతారు. డౌటే లేదు. పెద్దలు కూడా మెచ్చుకోదగ్గవే. www.koanteykoti.com లో ఫ్రీగా ఈ పాటలు వినే అవకాశం ఉంది. కుర్రాళ్లూ... కుమ్మేసుకోండి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Okkadine movie release postpone
Port star poonam pandy rejects kissing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles