Svsc audio function in ramanaidu studios

Mahesh Babu, Venkatesh, Seethamma Vakitlo Sirimalle Chettu, Audio, SVSC Audio, December 15, venue change, reason, Mickey J Meyer, Srikanth Addala, Samantha, Anjali, Dil Raju

SVSC audio function in Ramanaidu Studios.

SVSC audio function in Ramanaidu Studios.png

Posted: 12/03/2012 05:19 PM IST
Svsc audio function in ramanaidu studios

SVSC

తెలుగులో చాలా సంవత్సరాల తరువాత వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో కూడా ఈనెల 15వ తేదీన వెంకటేష్ బర్త్ డే కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఎక్కడ అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ప్రముఖ నిర్మాతగా పేరుత తెచ్చుకున్న దిల్ రాజు ఏపని చేసినా ముందు చూపుతో చేస్తాడు. ఈ సినిమా ఆడియో వేడుక విషయంలో కూడా అలానే చేశాడని సమాచారం. ప్రముఖ నిర్మాత అయిన సురేష్ బాబు తనయ మాళవిక వివాహం ఈ నెల 5 న హైదరాబాదులో ఘనంగా జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇందుకోసం నగర శివారు నానక్ రాం గూడాలోని రామానాయుడు స్టూడియోలో అద్భుతమైన వివాహ వేదికను తయారుచేయించారు. ఈ వివాహ వేదిక ఖర్చులో దిల్ రాజు కొంత వరకు భరించాడట. ఎందుకంటే.... ఈ పెళ్ళి తరువాత ఆడియోని అదే వేదిక పై విడుదల చేస్తారని అంటున్నారు. అందుకే దిల్ ఆ ఖర్చులో కొంత భరించాడని అంటున్నారు. సో... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుక రామానాయుడు స్టూడియో జరగనుందని ఫిలింనగర్ టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  D for dopidi movie logo launch
Tamil eega contests in chennai film festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles