ఇంతకాలం తెరవెనుక నుండి కథనడిపించిన ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు వెండితెరమీద కూడా కదలాడబోతున్నాడు. పవన్ కల్యాణ్ కథానాయకుడుగా తాను రూపొందిస్తున్న చిత్రంలో (వర్కింగ్ టైటిల్ 'సరదా') త్రివిక్రమ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.
అయితే త్రివిక్రమ్ ని యాక్ట్ చేయమని పట్టుబట్టింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. కథలో కీలకమైన ఈ పాత్రలో త్రివిక్రమ్ ని నటించమని పవన్ సూచించిన మీదటే త్రివిక్రమ్ అంగీకరించారట. ఇకమీదట తెరమీద ఏ సంచలనాలు చేయబోతున్నాడో ఈ మాటల మాంత్రికుడు.
ఇదిలా ఉండగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పి టాలీవుడ్ టాప్ గ్రాసర్ మూవీస్ లిస్టులో చేరిపోయింది. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా 200 రోజులు (డబుల్ సెంచురీ) పైగా కొన్ని థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.
హిందీలో వచ్చిన ‘దబాంగ్’ సినిమాకి రిమేక్ గా తీసిన ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చాలా మార్పులు చేసి తీసిన సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే ‘గబ్బర్ సింగ్’ లోని కొన్ని సీన్స్ ని తాజాగా వస్తోన్న హిందీ వెర్షన్ దబాంగ్ 2 లో వాడుకుంటున్నారు.
హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ని అందించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more