Purijagannath birthday story

purijagannath,birthday,story, cameramen ganga to rambabu, pokiri,

purijagannath-birthday-story

6.png

Posted: 09/28/2012 03:18 PM IST
Purijagannath birthday story

puri_inner

టాలీవుడ్ స్టైల్ ను ఉన్న ఫలానా మార్చేసిన దర్శక దిగ్గజం పూరీ జగన్నాథ్ ...ఇవాళ పూరీ బర్త్డే ఈ సందర్భంగా ఆయన మీద ఓ స్పెషల్ స్టోరీ.. జగన్ సినిమల్లోగానీ... ఆ సినిమా టైటిల్స్ లో గాని ఎక్కడా కవితా ధోరణి కూడా కనిపించదు. కథానాయకుడిని ఉన్నతుడిగా ... మహోన్నతుడిగా చూపించడం ఆయనకి అసలే తెలియదు. సంభాషణల విషయానికే వస్తే దర్శకుడిగా కన్నా రచయితగా ఆయనకి ఎక్కువ మార్కులు వేయాలనిపిస్తుంది. నిజ జీవితంలోలాగే ఆయన సినిమాల్లో సంభాషణలు అలా అలా అలవోకగా సాగిపోతాయి. భారీ డైలాగులను బట్టి పట్టినట్టుగా పాత్రలతో చెప్పించే పద్ధతి ఆయన సినిమాల్లో ఎక్కడా కనిపించదు. లవ్ ... యాక్షన్ ... సెంటిమెంట్ ... కామెడీ ఇలా ప్రతి అంశంపై ఆయన తనదైన ముద్ర వేశారు. అందుకే  'బద్రి' ... 'ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం' ... అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' ... 'శివమణి' ... 'పోకిరి' ... 'దేశముదురు' ... 'బిజినెస్ మేన్' వంటి చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తారో, ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కోసం కథానాయకులు సైతం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండటం విశేషం. తాజాగా ఆయన తెరకెక్కించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం అక్టోబర్ 18 న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాతో పూరీ మరో చరిత్ర స్రుష్టిస్తాడని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో తెలుగువిశేష్.కాం పూరీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi trivikram alluarjun movie 50days
Ramcharan evadu itemsong devisri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles