Sridevi madhuri deekshit tv

sridevi, madhuri deekshit, tv show, spetember 30th

sridevi-madhuri-deekshit-tv

1.png

Posted: 09/27/2012 01:43 PM IST
Sridevi madhuri deekshit tv

sri_and_madhuri_newiner       శ్రీదేవి... అతిలోక సుందరి. తన అందచందాలతో అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ను ఓ ఊపుఊపిన హీరోయిన్ శ్రీదేవి. పదహారేళ్ళ ఈ అందగత్తెను తలుచుకుని ఉప్పొంగని హృదయం లేదు. అందానికి.. అభినయానికి.. పసితనానికి.. పరువానికి.. అద్దం పట్టిన ఒకనాటి అందాల తార శ్రీదేవి.. ఇప్పటికీ అదే పరువంతో, అదే లేలేత అందాలతో కనువిందు చేస్తోంది.
     ఇక.. పాతికేళ్ళ పాటు కళ్ళు చెదిరే చిందులు.. అందంతో ఆకట్టుకునే అద్భుతరూపం.. నటనతో మెప్పించింది. నాట్యంతో అలరించింది. ఆమే ఒకప్పటి నంబర్ వన్ హీరోయిన్ మాధురి దీక్షిత్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆరాధ్యదేవత అయింది మాధురి దీక్షిత్. నలభై ఐదేళ్ల మాధురి బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా నిలిచింది. ఏక్ దో తీన్ అంటూ తేజాబ్ లో మాధురి వేసిన స్టెప్పలు అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు.
     గతంలో సిల్వర్ స్క్రీన్ పై నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడ్డ ఈ ఇద్దరు వెటరన్ స్టార్లు. ఇప్పుడు ఒకే వేదికపై కనిపించనున్నారు. కనిపించడమే కాదు ఏకంగా ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేయనున్నారు. ఇందుకు కలర్స్ ఛానల్ నిర్వహిస్తున్న డ్యాన్స్ రియాల్టీ షో జలక్ దిఖ్ లాజాసీజన్ -5 గ్రాండ్ ఫినాలే వేదికైంది. ఇప్పటికే మాధురి ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 49ఏళ్లయినా శ్రీదేవిది నేటికీ అదే అందం. ఇద్దరు పిల్లల తల్లి అయినా బ్యూటీ తగ్గలేదు. దాదాపు 15ఏళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీదేవి ఇటీవలే ఇంగ్లిష్ -వింగ్లిష్ మూవీలో నటించింది.
 
    ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా శ్రీదేవి జలక్ దిక్లా జా షోలో పాల్గొంటోంది. ఒకప్పుడు స్టార్ డమ్ కోసం పోటీపడ్డ వీరు ఇప్పుడు ఒకే వేదికపై కనిపించనుండడం విశేషం. ఇన్ని అందాలను ఒకేచోట చూడటానికి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కలయికతో గ్రాండ్ ఫినాలే అదిరిపోనుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ చూడాలంటే మాత్రం సెప్టెంబర్ 30వరకు ఆగాల్సిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmadha vinayakudu sonia
Pawan kalyan gangato rambabu audio review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles