Pawan kalyan gangato rambabu audio review

pawan-kalyan-gangato-rambabu-audio-review, release today from aditya music

pawan-kalyan-gangato-rambabu-audio-review

13.gif

Posted: 09/26/2012 08:23 PM IST
Pawan kalyan gangato rambabu audio review

 cgt_inner       గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా కోసం అభిమానులు ఆస్తకిగా ఎదురు చూస్తున్నారు. సంచలనాల దర్శకుడు పూరీజగన్నాథ్ సారధ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాకు  మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా పాటలు ఇవాళ (బుధవారం) విడుదల అయ్యాయి. ఈ పాటలకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. కెమెరామన్ గంగతో రాంబాబు పాడిన పాటలు ఎలా ఉన్నాయో సమీక్షిద్దాం..
మొదటి పాట : కెమెరామాన్ రాంబాబు.. థీమ్ సాంగ్ ఈ సినిమాలో రాంబాబు వ్యక్తిత్వం వర్ణిస్తూ సాగే ఈ పాటను హేమ చంద్ర, కారుణ్య, నరేంద్ర పాడారు. ఈ పాట పవన్ అభిమానుల కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లుగా సాగుతుంది. ఈ పాటలోని పదాలు పవన్ అభిమానులను ఎంతోగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
 రెండవ పాట : పిల్లని చూస్తే... కారుణ్య, చైత్ర ఆలపించిన ఈ పాట సరదా అయిన పదాలతో సాగుతుంది. ప్రేయసి ప్రియులు మధ్య సాగే ఈ పాట ఆలరించే విధంగా ఉంది.
మూడవ పాట : జ్వరమొచ్చింది... ఈ పాట వింటే ఇది సినిమాలో ఐటెం సాంగ్ ని చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఈ పాటను శ్రవణ భార్గవి, మురళి గానం చేశారు. మాస్ కోసం ఉద్దేశించిన ఈ పాట అదే ఊపులో సాగుతుంది.
నాలుగవ పాట : ఎక్స్ ట్రార్డనరీ.... హేమ చంద్ర గానం చేసిన ఈ పాట వినసొంపుగా ఉంది. చిత్రీకరణ ఇలాంటి పాటలకు బాగా హెల్ప్ అవుతుంది.
 ఐదవ పాట : తలదించుకు బతుకుతావా... సందేశత్మంగా సాగే ఈ పాటను కారుణ్య, హేమ చంద్ర, శ్రీకృష్ణ, నరేంద్ర గానం చేశారు. కథలో భాగంగా వినిపించే ఈ పాటలో చాలా పదునైన పదాలను ఉపయోగించారు రచయిత.
ఆరవ పాట : మెలికలు తిరుగుతుంటే ... ఈ ఆల్బమ్ లో ఉన్న ఉషారు అయిన పాటగా ఈ పాటను పేర్కొనవచ్చు. నరేంద్ర, గీతా మాధురి గానం చాలా ఉషారుగా సాగుతుంది. అకట్టుకునే ఈ పాట అభిమానులకు చాలా ఉత్సాహం ఇస్తుంది.  మొత్తంగా పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే సాగాయి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi madhuri deekshit tv
Aishwarya rai named un hivaids envoy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles