Rajamouli eega oscar namini list

rajamouli-eega-oscar-namini-list,kahani hindi movie, heroine, dirty picture

rajamouli-eega-oscar-namini-list

13.gif

Posted: 09/17/2012 05:37 PM IST
Rajamouli eega oscar namini list

        raja_innerతెలుగు చలన చిత్ర రంగ పరువు నిలిపాడు దర్శక ధీరుడు రాజమౌళి.  రెండేళ్ళపాటు నిర్విరామ  కృషి సలిపి తెరకెక్కించి  ‘ఈగ’ కష్టం ఇంకా ఫలితాలనిస్తూనే ఉంది. కలెక్షన్ల పరంగానూ తన ఆధిక్యాన్ని కనబరిచిన ఈ మూవీ ఇప్పుడు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ నామినీలో చోటు దక్కించుకుంది. ఇండియా నుండి ఉత్తమ చిత్ర ఎంపిక కోసం వివిధ భాషల నుండి 12 సినిమాలను ఎంపిక చేయగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి 26 వరకు హైదరాబాదులో ఈ పన్నెండు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అందులో ఎంపికైన ఉత్తమ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కి పంపిస్తారు. తమిళ్ నుండి రెండు, మలయాళం నుండి రెండు, హిందీ నుండి ఏడు సినిమాలు ఎంపిక కాగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక కావటం విశేషమే కాదు, టాలీవుడ్ కు ఉపశమనం కూడా.. వివిధ భాషలకు చెందిన మిగతా చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి.
•    ఈగ (తెలుగు)
•    కహాని (హిందీ)
•    బర్ఫీ (హిందీ)
•    హీరోయిన్ (హిందీ)
•    ఫెర్రారీ కి సవారి (హిందీ)
•    గాంగ్స్ అఫ్ వసేపూర్ (హిందీ)
•    డర్టీ పిక్షర్ (హిందీ)
•    పాన్ సింగ్ తోమార్ (హిందీ)
•    వజకు ఎన్ 18/9 (తమిళ్)
•    7 ఎఎం అరివు (తమిళ్)
•    డియోల్ (మరాఠి)
•    ఆకశింతే (మలయాళం)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharat vennela one and half
Life is beautiful amala triler  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles