Camera men ganga to rambabu dialogues

camera men ganga to rambabu dialogues audio on september 24th postpone

camera men ganga to rambabu dialogues

15.gif

Posted: 09/11/2012 06:54 PM IST
Camera men ganga to rambabu dialogues

      పూరీ జగన్నాథ్ సినిమా అంటే.. పంచ్ డైలాగ్స్ కి పుట్టినిల్లు. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే చెప్పేదేముందీ.. కేకలే... పూరీ కి దర్శకుడిగా అవకాశం కల్పించి పవన్ చేసిన సినిమా ‘బద్రి’. బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ మూవీలో 'నువ్ నందా.. అయితే నేను బద్రీ బద్రీనాథ్..' అంటూ ప్రకాష్ రాజ్ పై పంచ్ డైలాగ్స్ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తాజాగా మళ్లీ పవన్-పూరీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అప్ కమింగ్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'లో పంచ్ డైలాగ్స్ కు కొదువే లేదని తెలుస్తోంది. ఆ సినిమాలో పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చేపంచ్ డైలాగ్స్ కొన్ని అనఫీషియల్ గా హల్ చల్ చేస్తున్నాయి.. అవి ఇవే...puri_jaganప్రకాష్ రాజ్: రేయ్.. ఈ స్టేట్ నీదా..?
పవన్: స్టేట్ కాదురా.. స్టేట్‌లో ఉన్న వాళ్లు నావాళ్లు!ప్రకాష్ రాజ్: రూల్స్ పాస్ చేస్తున్నావ్... నువ్వు సీఎంవా?
పవన్: అవును సీఎంనే...అంటే కామన్ మ్యాన్‌ని..
        పవన్ నోటివెంట దూసుకొచ్చే మాటల తూటాలకు  ఈ సినిమాలో కొదవ లేదని తెలుస్తోంది.  ఈ మూవీలో పవన్ కళ్యాణ్ టీవీ చానల్ రిపోర్టర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల జర్నలిస్టుగా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర గంగగా చేస్తోంది.
      కాగా, ఈ మూవీ ఆడియోలో విడుదల తేదీని సవరించినట్టు సమాచారం అందుతోంది. ముందుగా  సెప్టెంబర్ 21న ఈ చిత్రం ఆడియో విడుదల చేయాలని భావించారు. అయితే ఇది సెప్టెంబర్ 24కి వాయిదా పడినట్టు తెలుస్తోంది. మూవీ  దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 11న వెండితెరలను తాకనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh new movie golmar movie
Film production in vijayanagaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles