Priyamani charulatha postphone

priyamani charulatha postphone

priyamani charulatha postphone

9.gif

Posted: 09/10/2012 04:38 PM IST
Priyamani charulatha postphone

        ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త కథా చిత్రం ‘చారులత’. ఈ మూవీ శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం priyamani_eeeవిడుదలరోజునే రిలీజ్ కావాల్సిఉంది. అయితే కొన్ని అనివార్య కారాణాల రిత్యా ఈ హార్రర్ సినిమాని మొదట సెప్టెంబర్ 14న విడుదల చేయాలనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రియమణి అవిభక్త కవలుగా నటిస్తున్న ‘చారులత’ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోన్ కుమరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ మూర్తి నిర్మించారు. కన్నడ మరియు తమిళ బాషలలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. మూడు బాశాల్లోను ఈ చిత్రాన్ని ఒకే సారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రియమణి సరసన స్కంద ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో ప్రియమణి చేసిన పాత్ర ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని సినిమా విజయం సాదిస్తుందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. సుందర్ సి బాబు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనకు అవార్డు ఖాయంగా భావిస్తోంది ప్రియ..

ఇదిలా ఉండగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర యు.ఎస్ ప్రింట్స్ సమాచారం...  15 సాదారణ ప్రింట్స్, 52 డిజిటల్ ప్రింట్స్ రేపు సాయంత్రం యు.ఎస్ ఫ్లైట్ లో వెళ్లనున్నాయి. ఈ చిత్రంలో నూతన నటీనటులతో పాటు అమల అక్కినేని, శ్రియ సరన్ మరియు అంజలా జావేరి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajendra prasad movie dream
Nagarjuna as ramakrishna parama hamsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles