Allari naresh ramyakrishna romance

allari naresh ramyakrishna romance yamudiki mogudu movie shooting stage richa panay

allari naresh ramyakrishna romance

8.gif

Posted: 09/08/2012 03:28 PM IST
Allari naresh ramyakrishna romance

       అత్తలతో సరసాలాడటం టాలీవుడ్ లో షరామామూలే. ఇదే కోవలో ఇప్పడు టాలీవుడ్ సడెన్ స్టార్ బిరుదాంకితుడైన అల్లరి నరేష్ ramya_innereeరమ్యకృష్ణతో కలిసి స్టెప్పులేసి గోలగోల చేస్తున్నాడు. అల్లరి నరేష్, రిచా పనాయ్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘యముడికి మొగుడు’. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అల్లుడా మజాకా చిత్రంలోని ‘అత్తో అత్తమ్మ కూతురో’ పాటను రీమిక్స్ చేసి, రమ్యకృష్ణ – నరేష్ – రిచా పనాయ్ ల మీద చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెలలోనే కంప్లీట్ చేసేందుకు చిత్రయూనిట్ కసరత్తులు చేస్తోంది. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్ర నిర్మాత అడ్డాల చంటి తెలిపారు. సాయాజీ షిండే యముడిగా కనిపించనున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందిస్తున్నారు. 'సుడిగాడు' హిట్ తో జోష్ మీదున్న అల్లరి నరేష్   ఈ సినిమాపై మరిన్ని ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ‘యముడికి మొగుడు’ కలిగి ఉండటం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baba sehgal pawanisam full video song
Commercial offer for mahesh babu for 4 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles