'మంచి ఉద్యాగాల కోసమో, మెరుగయిన జీవన ప్రమాణాల కోసమో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మన దేశంలోనే చక్కని ఉద్యోగావకాశాలున్నాయి, వాటిని వినియోగించుకుంటే చాలు' అనే చిన్న సందేశానికి.. చిక్కని వినోదాన్ని జోడించి రూపొందుతున్న చిత్రం 'ఎన్నారై'. 'నౌ రిటర్న్ టు ఇండియా' అనేది ట్యాగ్‌లైన్. రోహిత్- శ్రావ్యారెడ్డి జంటగా, ఏరీస్ ప్రొడక్షన్స్ పతాకంపై రఘునందన్ గూడూర్ స్వీయ దర్శ కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలు సెప్టెంబర్ 1న 'మధుర ఆడియో' ద్వారా విడుదల కాను న్నాయి. అనీష్ రాజ్ దేశ్‌ముఖ్ సంగీత దర్శకుడిగా పరిచయ మవుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీమతి పద్మశ్రీ శ్రీనివాస్ గీత రచయిత్రిగా పరిచయమవుతుండడం విశేషం.
'ఎన్నారై' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతోపాటు టిఆర్‌ఎస్ ముఖ్యనేతలు హరీష్‌రావు, మాజీమంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ముఖ్యఅతిధులుగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన వివరాలు దర్శకనిర్మాత రఘునందన్ గూడూర్ వెల్లడించారు. ''విదేశాల్లో పలు సంవత్స రాలు ఉద్యోగాలు చేసిన వ్యక్తిగా.. విదేశీ నివాసంలో ఉండే కష్టాలు, నష్టాలు, భావోద్వేగప రమైన సమస్యలు నాకు బాగా తెలుసు. అందుకే నేను దర్శకుడిగా మారుతూ.. నేనే నిర్మిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి అదే ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకున్నాను. అలా అని ఇందులో సందేశాలమేమీ ఉండవు. వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన చిత్రమిది. ఆస్ట్రేలియాలో కొంత భాగం, హైద్రాబాద్‌లో ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. సెప్టెంబర్ 1న ఆడియో విడుదల చేసి, అదే నెల చివరికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
ఆహుతి ప్రసాద్, హేమ, శివారెడ్డి, గుండు హనుమంతరావు, ఫిష్ వెంకట్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: అనీష్ రాజ్‌దేశ్‌ముఖ్, సాహిత్యం: శ్రీమతి పద్మశ్రీ శ్రీనివాస్, రచన- చిత్రానువాదం- నిర్మాత- దర్శకత్వం: రఘునందన్ గూడూర్.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more