Jagapathi babu bhoomika april fool

jagapathi babu bhoomika april fool

jagapathi babu bhoomika april fool

24.gif

Posted: 08/24/2012 05:37 PM IST
Jagapathi babu bhoomika april fool

       ఏప్రిల్‌ 1న జరిగిన సంఘటనలను కథావస్తువుగా ఎంచుకుని సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఏప్రిల్‌ఫూల్‌'. jaga_pathi_inneeeeeజగపతిబాబు, భూమిక, రణధీర్‌, సృష్టి, గుల్హన్‌గ్రోవర్‌ ప్రధాన పాత్రదారులు. కృష్ణస్వామి శ్రీకాంత్‌ అయ్యంగార్‌ దర్శకత్వంలో సుధా ఎంటర్‌టైన్‌మెంట్‌, కర్తాళ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌ పరిసరాల్లో, కొంపల్లె ఫారెస్ట్‌ అకాడమీలో రణధీర్‌, సృష్టి తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
      ఈ సందర్భంగా మూవీ గురించి నిర్మాత జి.ఎల్‌. శ్రీనివాస్‌ ముచ్చటించారు. ‘ఇంతవరకు 70 శాతం షూటింగ్‌ పూర్తయిందనీ, అందులో భాగంగా రెండు పాటలతోపాటు క్లైమాక్స్‌ను చిత్రీకరించామనీ అన్నారు. అలాగే జర్నలిస్టు పాత్ర పోషిస్తున్న భూమికపై ఐదురోజులపాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించామనీ ఆయన వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయ్యేంతవరకు నిరవధికంగా కొనసాగుతుందనీ చెప్పారు. ఈనెల 27 నుంచి జగపతిబాబు, గుల్షన్‌గ్రోవర్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను తీయనున్నామనీ ఆయన తెలిపారు. మిగిలిన మూడు పాటలలో ఒక పాటను హైదరాబాద్‌లోను, రెండు పాటలను అవుట్‌డోర్‌లో చిత్రీకరించి, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు.
      ‘రెగ్యులర్‌ చిత్రాల కోవలో కాకుండా భిన్నంగా రూపొందుతున్న చిత్రమిదనీ దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తనికెళ్ళ రాజేంద్రప్రసాద్‌, సంగీతం: డా.బంటి. సహ నిర్మాత: సీమ అజరుద్దీన్‌.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nav deep in young tiger ntr movie
Hot item girl andrea give thanks to puri jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles