Veteran actress anjali devi birthday today special story

veteran actress anjali devi birthday today special story

veteran actress anjali devi birthday today special story

16.gif

Posted: 08/24/2012 05:05 PM IST
Veteran actress anjali devi birthday today special story

       అప్పటి అందాల 'అనార్కలి'.. సీతాదేవి... సుధీర్గ కాలం పాటు నవరస నట పరిమళాలు వెదజల్లిన అభినయ పారిజాతం..  ఆమె ఎవరోకాదు.. అంజలీదేవి. తొలి తరం కథానాయికగా అరుదైన స్థానాన్ని దక్కించుకున్న 'స్వప్న సుందరి' ఆమె. తూర్పు గోదావరి జిల్లాanjali_f పెద్దాపురంలో జన్మించిన అంజలీదేవి, బాల్యంలోనే నటన పట్ల మక్కువను పెంచుకుంది. కాకినాడ 'యంగ్ మెన్ హ్యాపీ క్లబ్' లో చేరి నాటకాలు ఆడుతోన్న ఆమె, 1947 లో 'గొల్లభామ' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యత లేని డాన్సర్ పాత్రని పోషించిన అంజలీదేవిని, ఎల్వీ ప్రసాద్ తను తెర కెక్కిస్తోన్న 'కష్టజీవి' చిత్రంతో కథానాయకను చేశారు. అంతే నవరసాలను అవలీలగా ఆవిష్కరించడమెలాగనే అనుభవాన్ని రంగస్థల పైనే సంపాదించిన అంజలీదేవి, ప్రతి పాత్రలోనూ లీనమై పోయింది ... ప్రేక్షకుల హృదయాల్లో మమేకమై పోయింది.
          anjali_innతొలినాళ్లలోనే ఎన్టీఆర్ ... ఏ ఎన్నార్ కాంబినేషన్లో  'పల్లెటూరి పిల్ల' చిత్రంలో నటించిన అంజలీదేవి, ఆ తరువాత వాళ్లిద్దరితో కలిసి పౌరాణిక ... జానపద ... సాంఘిక ... చారిత్రక చిత్రాలలో తిరుగులేని కథానాయికాగా వెలిగింది. ఎన్టీఆర్ సరసన 'భట్టి విక్రమార్క', 'భీష్మ', 'లవకుశ', 'బడి పంతులు' చిత్రాల్లో ఆమె ఆవిష్కరించిన నవరసనట విన్యాసం చూసి తీర వలసిందే. ఇక అక్కినేనితో ఆమె చేసిన 'స్వప్న సుందరి', 'సువర్ణ సుందరి', 'చెంచులక్ష్మి', 'జయభేరి', 'భక్త జయదేవ', 'భక్త తుకారం' వంటి చిత్రాల్లో ఆమె చూపిన నటనా పటిమ నిత్య నీరాజనాలు అందుకుంది.
        ఆమె కథానాయికగా నటించిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే అయినా 'లవకుశ' చిత్రం మాత్రం వాటిలో తలమానికంగా నిలిచిందని చెప్పవచ్చు. ఆ తరువాత కాలంలో ఈ పాత్రను ఎంతమంది కథానాయికలు పోషించినా అంజలీదేవి మార్కును మాత్రం చెరపలేకపోయారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన అంజలీదేవిని ఎన్నో అవార్డులు ... బిరుదులు అలంకరించాయి. అరుదైన ఆ ఘనతను దక్కించుకున్న అంజలీదేవి పుట్టినరోజు ఇవాళ. ఈ మహోన్నత నటనా మూర్తికి ఆంధ్ర విశేష్ జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles