Songs writer jogayya birthday

songs writer jogayya birthday

songs writer jogayya birthday

4.gif

Posted: 08/24/2012 04:46 PM IST
Songs writer jogayya birthday

      గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.. ప్రస్తుతం ఎన్నో సినిమా ఆడియో వేడుకల్లో వినిసిస్తోన్న పేరు.  మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఈ సాధకుడి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా  ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి joga_eeప్రస్థానం గురించి తెలుసుకుందాం..  స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ళ. చిన్నతనంలో గాయకుడి కావాలని కలలు కనేవారు. ఐదారు తరగతుల్లోనే సినిమాల ప్రభావం మొదలైంది. ఇంటర్ కి నర్సరావుపేట లో చేశారు. నచ్చిన పాటలన్నీ రికార్డ్  చేయించుకుని విని నేర్చుకునేవారు. వరంగల్ లో ఇంజినీరింగ్ చేశారు. బెంగళూరులో ఉద్యోగం. అక్కడ ఓ గాయకుడితో పరిచయమై అక్కడక్కడా ఆర్కెస్ట్రాలలో పాడడం మొదలుపెట్టారు.
   అక్కడే కన్నడ రచయిత శ్రీచంద్ర, గాయని సుజాత పరిచయమయ్యారు. ఆ సమయంలో దాదాపు నలభై క్యాసెట్లకు భక్తిపాటలు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. అలా ఆయన దగ్గర గీత రచనలో మెలకువలు నేర్చుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వచ్చిన యువసేన చిత్రానికి మొదటి సారిగా పాటల రచయితగా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో రెండు పాటలు రాశారు.
   ఆ రెండు పాటలు సూపర్ హిట్  అయ్యాయి. ఆ తర్వాత ఎన్నో అధ్బుతమైన పాటలను ప్రేక్షకులకి అందించారు. ఇటీవల విడుదలైన సంచలన విజయాలు సాధించిన గబ్బర్ సింగ్, ఈగ, జులాయి చిత్రాలకు రామజోగయ్య శాస్త్రి టైటిల్ సాంగ్స్ అందించారు. ఎన్నో మధురమైన పాటలను రాస్తు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న రామజోగయ్య మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల్ని అలరించాలని ఆంధ్రవిశేష్.కాం కోరుకుంటుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veteran actress anjali devi birthday today special story
Sudigadu allari naresh monal gajjar movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles