Chiru opens suresh kondeti dubbing theator

chiru opens suresh kondeti dubbing theator

chiru opens suresh kondeti dubbing theator

5.gif

Posted: 08/21/2012 02:00 PM IST
Chiru opens suresh kondeti dubbing theator

       తెలుగు చిత్రసీమకు అందుబాటులో ఉండేందుకు మరో డబ్బింగ్ థియేటర్ హైదరాబాద్ లో ఆవిష్క్రుతమైంది. ప్రముఖ తెలుగు suresh_kon_1.1సినీవార పత్రిక 'సంతోషం' ఆధ్వర్యంలో సురేష్‌ కొండేటి ప్రారంభిస్తున్న డబ్బింగ్‌, రికార్డింగ్‌ మరియు రీ-రికార్డింగ్‌ స్టూడియో ప్రారంభోత్సవం ఫిలింనగర్‌లో జరిగింది. ప్రముఖనటులు, రాజ్యసభ సభ్యులు, 'పద్మభూషణ్‌' డా|| చిరంజీవి ముఖ్యఅతిధిగా విచ్చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించి స్టూడియోను ప్రారంభించారు.
       అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. 'ఇటీవల జరిగిన 'సంతోషం' అవార్డ్‌ ఫంక్షన్‌కి రాలేకపోయాను. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఈ డబ్బింగ్‌ థియేటర్‌ ప్రారంభించడానికి రావడం జరిగింది. సురేష్‌ని ఇండస్ట్రీలో పరిచయస్తుడిలా కాకుండా నా కుటుంబ సభ్యుడిలా భావించి నేనీ రోజు ఇక్కడికి వచ్చాను. ఇక అతని గురించి suresh_kond2.1చెప్పాలంటే... 22 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. నేను చూస్తుండగానే మామూలు పాత్రికేయుడిగా కెరియర్‌ను ప్రారంభించి రిపోర్టర్‌గా, ఎడిటర్‌గా, డిస్ట్రీబ్యూటర్‌, పత్రికా సంపాదకుడిగా, డబ్బింగ్‌ చిత్రాల నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగాడు. తాను ప్రారంభించిన సంతోషం పత్రిక 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పదేళ్ళుగా ప్రతిఏటా కళాకారులను, ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ అవార్డులను ఇవ్వడం, అందులోనూ ఈ సంవత్సరం సౌత్‌ ఇండియా ఫిలిం ఇండస్ట్రీల మొత్తానికి అవార్డులను ఇవ్వడమనేది ముదావహం. ఇప్పుడు కొత్తగా డబ్బింగ్‌ తదితర టెక్నికల్‌ కార్యక్రమాలకు సంబంధించి ఈ స్టూడియోను ప్రారంభించడం అభినందనీయం. స్వయంకృషితో మనిషి ఉన్నతస్థాయికి ఎదుగుతాడనడానికి సురేష్‌ కొండేటి చక్కని ఉదాహరణ. భవిష్యత్తులో అతను ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.
       నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన చిరంజీవిగారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు సురేష్ కొండేటి. యాద్రుచ్చికమే అయినా.. సంతోషం పత్రిక 10 ఏళ్ళు పూర్తిచేసుకోవడం, అవార్డ్‌ ఫంక్షన్‌ విజయవంతంగా జరగడం చాలా ఆనందంగా ఉందని సంతోషంవ్యక్తం చేశారాయాన.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala akkineni back to the big screen
Nara rohit nittyamenon movie shooting end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles