Vikram and sridevi movies progress

vikram and sridevi movies progress

vikram and sridevi movies progress

38.gif

Posted: 08/19/2012 07:08 PM IST
Vikram and sridevi movies progress

       అపరచితుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయుడైన తమిళ కథానాయకుడు విక్రమ్ త్వరలో 'మనోహరుడు'గా vikram_f దర్శనమివ్వనున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ తాజాగా విక్రమ్ హీరోగా తమిళంలో 'ఐ' పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి 'మనోహరుడు'గా నామకరణం చేశారు. ఇందులో విక్రమ్ రెండు విభిన్న తరహా పాత్రల్ని పోషిస్తాడు. ఆయన సరసన ఓ కథానాయికగా ఎమీ జాక్సన్ ఇప్పటికే ఎంపిక కాగా, మరో కథానాయిక ఎంపిక జరగాల్సివుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ తన పారితోషికంగా 15 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
    sri_deviఇదిలా ఉండగా,  నిన్నటితరం అందాలతార శ్రీదేవి త్వరలో ఓ త్రీడీ సినిమాలో నటించనుంది. పాతికేళ్ల క్రితం అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా వచ్చిన 'మిస్టర్ ఇండియా' చిత్రానికి సీక్వెల్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని 3D ఫార్మేట్లో నిర్మిస్తారు. ఈ 'మిస్టర్ ఇండియా-2'లో మళ్లీ అనిల్, శ్రీదేవి జంటే నటించనుంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించే యోచన చేస్తున్నారు. ఒరిజినల్ లో అమ్రిష్ పురీ పోషించిన విలన్ పాత్రను ఈ సీక్వెల్ లో సల్మాన్ ఖాన్ పోషించే అవకాశం వుంది. ఆ విషయంపై ఇప్పటికే సల్మాన్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, 'మిస్టర్ ఇండియా' చిత్రాన్ని కూడా ఇప్పుడు త్రీడీ రూపంలోకి కన్వర్ట్ చేస్తున్నారు.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh 100days function
Gabbar singh completed 100 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles