Actress samantha now busy with shootings

actress samantha now busy with shootings

actress samantha now busy with shootings

15.gif

Posted: 08/16/2012 04:08 PM IST
Actress samantha now busy with shootings

        చాలా కాలం తర్వాత అందాల భామ, ప్రస్తుత క్రేజీ యాక్ట్రస్ సమంతా మొఖానికి రంగేసుకుంది.  గత కొన్నాళ్లుగా స్కిన్‌ ఎలర్జీ కారణంగా సమంత షూటింగ్స్‌ లో పాల్గొనలేదు. ఈ సుందరి షూటింగ్లో పాల్గొని దాదాపు నెలపైనే అయ్యింది. అంతేకాదు చేతికొచ్చిన  పెద్ద పెద్ద అవకాశాలు కూడా పోగొట్టుకుంది.  ఇన్నాళ్లు కెమెరా కు దూరంగా ఉండటానికి కారణం సమంతకు సోకిన స్కిన్‌ఎలర్జీ అని టాక్. ఇది saman_feeeప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయిందని అందుకే నిన్నషూటింగ్‌లో పాల్గొందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
       నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సిద్దార్థ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్న, ఇవాళ  ఆ షూటింగ్ లో పాల్గొంటుంది. మొత్తానికి సమంతా మళ్లీ షూటింగ్స్ లో పాలు పంచుకోవటం పెండింగ్ లో ఉన్న ప్రాజక్టులకు కొత్త ఉత్సాహం లభించినట్లవుతుంది. కాగా, సమంతా రెడీ అవటంతో టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగ్ మరో షెడ్యూల్ షురూ కానుంది. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్  ఎల్లుండు అంటే ఈ నెల 19 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా 2013 జనవరిలో విడుదల చేయనున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకున్నారు, కానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సమంత అనారోగ్యం పాలవడం వల్ల ఈ చిత్ర చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్  సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపించనున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేష్ మరియు మహేష్ బాబులకు తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్ మరియు జయసుధ నటిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Susanth sanvis adda movie second schedule starts
Vereran hero suresh challenge for balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles